చదువుకోవాలన్న తపన ఉండాలే కానీ వయస్సు అడ్డంకి కానే కాదు.

కొందరు చదువు కోసం ఎన్ని కష్టాలైన  ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటారు.

చదువుపై ఉన్న ఆసక్తిని తీర్చుకునేందుకు పెద్ద వయస్సులోనూ విద్యాభ్యాసం చేస్తుంటారు.

ఇటీవేల కేరళకు చెందిన 84 ఏళ్ల ఓ బామ్మ.. పరీక్షలో 100కి 94 మార్కులు సాధించారు.

తాజాగా బీహార్ కు చెందిన శివర్తి అనే మహిళ కూడా అలాంటి ఘనతే సాధించింది.

బీహార్ రాష్ట్రం నలంద ప్రాంతానికి చెందిన శివర్తి దేవి.. తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్షలు రాసింది.

ఆమెకు చిన్నతనం నుంచి చదువు అంటే అమితమైన ఆసక్తి.

అయితే కుటుంబ, ఇతర పరిస్థితుల కారణంగా చిన్నతనంలో చదువుకోలేక పోయింది.

ఇక  పెళ్లి చేసుకుని సంసార జీవితంలో చాలా ఏళ్లు గడిపింది.

ఇటీవలే బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 'ముఖ్యమంత్రి అక్షర్ అంచల్ యోజన్' అనే పథకం ప్రారంభించింది.

ఈ పథకం కింద మహిళలకు  ప్రాథమిక పరీక్ష రాసే అవకాశం కల్పిస్తున్నారు.

శివర్తి తో పాటు ఆమె కోడళ్లు శోభా దేవి, సీమా దేవి, వీణా దేవి, బింది దేవిలు కూడా ఈ పరీక్ష రాసేందుకు   సిద్ధమయ్యారు.

 ఇటీవలే నిర్వహించిన ఈ పరీక్షల్లో  నలుగురు కోడళ్లతో కలిసి అత్త పరీక్ష రాశారు.

ఇంటి పనులు  చూసుకుంటూ చదువుకుని శివర్తి దేవి ఈ పరీక్షలు రాశారు.

శివర్తి దేవి కూడా ఈ పరీక్ష కోసం ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.

ఈ నలుగురు కోడళ్లతో పాటు శివర్తి దేవి ప్రాథమిక పరీక్ష రాసి.. వార్తల్లో నిలిచారు.

మహిళ దినోత్సవం సందర్భంగా అత్తా కోడళ్లు పరీక్ష రాసిన చాలామందికి కొత్త స్ఫూర్తిగా నిలిచారు.