హైదరాబాద్‌ లో విద్య..  ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా!

భారతీయ అమెరికన్ అజయ్ బంగా  ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అజయ్ బంగాను నామినేట్ చేశారు.

బుధవారం వరల్డ్ బ్యాంక్ 25  ఎగ్జిక్యూటివ్ మెంబర్స్‌ బోర్డ్‌ అజయ్ బంగాను  ప్రెసిడెంట్ గా ఎన్నిక చేసింది.

జూన్ 2 నుంచి ఐదేళ్లపాటు అజయ్ బంగా  వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ గా విధులు  నిర్వహించనున్నారు.

వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా బాధ్యతలు  చేపట్టనున్న తొలి భారతీయ అమెరికన్ గా  అజయ్ బంగా చరిత్ర సృష్టించారు.

అజయ్ బంగా గురించి జో బైడెన్ గొప్పగా  చెప్పారు. వ్యాపార రంగంలో 30 ఏళ్ల అనుభవం  కలిగిన వ్యక్తి అంటూ ప్రశంసించారు.

అజయ్ బంగా నవంబర్ 10, 1959లో  పూణెలో జన్మించారు.

ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా.. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఇండియన్ ఆర్మీలో  రిటైర్ అయ్యారు.

అజయ్ బంగాకు హైదరాబాద్ తో కూడా  అనుబంధం ఉంది.

ఆయన షిమ్లాలోనే కాకుండా హైదరాబాద్  పబ్లిక్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేశారు.

ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ లో ఎకనామిక్స్,  అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ  పూర్తి చేశారు.

1981లో నెస్లే కంపెనీలో కెరీర్ ప్రారంభించి..  13ఏళ్ల పాటు సేల్స్, మార్కెటింగ్, జనరల్ డిపార్ట్  మెంట్లలో పనిచేశారు.

పెప్సికో కంపెనీ ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజ్ సక్సెస్ లో  కీలకపాత్ర పోషించారు.

ట్రేడ్ అండ్ ఇండస్ట్రీలో అజయ్ బంగా  సేవలకు 2016లో భారత ప్రభుత్వం  పద్మశ్రీతో సత్కరించింది.