ప్రముఖ జ్యోతిష్యశాస్త్ర నిపుణుడు వేణు స్వామి గురించి తెలుగు వారికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.

సమంత-నాగచైతన్యల విడాకుల తర్వాత ఈయన పేరు ప్రముఖంగా వినిపించింది.

సమంత-చైతన్యల పెళ్లికి ముందే.. వారిద్దరూ విడిపోతారంటూ.. వారి భవిష్యత్తు గురించి చెప్పుకొచ్చాడు వేణు స్వామి.

ఆయన చెప్పినట్లే జరగడంతో.. అప్పటి నుంచి ఈయన వ్యాఖ్యలపై జనాలకు ఆసక్తి, నమ్మకం పెరిగింది.

చాలా సందర్భాల్లో సెలబ్రిటీలను సంప్రదించకుండానే వారి జాతకాలు చెప్పి.. ఆ వీడియోలను పోస్ట్‌ చేస్తుంటాడు.

కేవలం జాతకాలు మాత్రమే కాక.. సెలబ్రిటీల పేరు మీద ప్రత్యేక పూజలు కూడా చేయిస్తాడు వేణు స్వామి.

గతంలో నేషనల్‌ క్రష్‌ రష్మికతో ప్రత్యేక పూజలు చేయించారు.

ఇక తాజాగా ఈ జాబితాలోకి మరో నటి చేరింది. ఆమె నిధి అగర్వాల్‌.

ప్రసుత్తం ఈ భామ ఇటు టాలీవుడ్‌, అటు కోలీవుడ్‌లో వరుస చిత్రాలు చేస్తూ.. ఫుల్‌ బిజీగా ఉంది.

ఈ క్రమంలో వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకున్న వీడియో వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో పింక్ కలర్ చుడీదార్ ధరించిన నిధి అగర్వాల్.. పూజలు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి.

వేణుస్వామి బృందం చెబుతున్నట్టుగా వేదమంత్రాల నడుమ కలశానికి పూజలు చేసింది నిధి అగర్వాల్‌.

నిధి అగర్వాల్‌ ఇంట్లో రాజ శ్యామల పూజ నిర్వహించినట్టు సమాచారం.

గతంలో రష్మిక మందన్న కూడా వేణు స్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకుంది.

నిధి అగర్వాల్ ఈ పూజ ఎందుకు చేసింది.. ఆమె జాతకంలో ఏమైనా దోషముందా వంటి విషయాలు తెలియాల్సి ఉంది.

సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన నిధి అతగర్వాల్‌.. ఆ తర్వాత మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబోలో వస్తోన్న ‘హరిహర వీర మల్లు’ సినిమాలో నటిస్తోంది.