మూవీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఎంత పేరుంటుందో.. వారి పిల్లలకు సైతం అంతే పేరు ఉంటుంది.

దాంతో సెలబ్రిటీలతో పాటుగా వారి పిల్లలు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు అని తెలుసుకోవాలన్న ఆరాటం అభిమానుల్లో ఉండటం సహజం.

అదీకాక సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడంతో.. వారు ఏం చేసినా క్షణాల్లో తెలిసిపోతుంది.

ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్.. ఓ బాలీవుడ్ నటితో పార్టీలో కెమెరాకు చిక్కాడు.

ఆ నటి ఆర్యన్ తో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఆర్యన్ ఖాన్ కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయితో కలిసి కనిపించి వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు.

తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు. బాలీవుడ్ నటి రోషిణి వాలియాతో కలిసి ఓ పార్టీ సందడి చేశాడు ఆర్యన్.

ఆర్యన్-వాలియా కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది రోషిణి. ఈ పిక్స్ కు జతగా ఎబౌట్ లాస్ట్ నైట్ అంటూ క్యాప్షన్ ట్యాగ్ చేసింది.

ఇక ఈ ఫోటోల్లో ముద్దుగుమ్మ రోషిని వాలియా యమహాట్ గా ఉంది.

ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆర్యన్ కొత్త గర్ల్ ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.