ఐఐటీ కాన్పూర్ తీవ్రమైన గుండె సమస్యలతో బాధపడేవారికి సంతోషకరమైన వార్త చెప్పింది.
గుండె మార్పిడి అవసరమైన వారికోసం ఏకంగా కృత్రిమ గుండెను తయారు చేసింది.
ఈ కృత్రిమ గుండెకు సంబంధించి జంతువులపై ట్రైల్ వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ట్రైల్స్ మొదలు పెట్టనున్నారు.
ట్రైల్స్ విజయవంతం అయితే.. రెండేళ్లలో కృత్రిమ గుండెను పేషంట్లకు అమర్చనున్నారు.
ప్రస్తుతం గుండె సమస్యలు చాలా పెరిగిపోయాయని ఐఐటీ కాన్నూర్ డైరెక్టర్ అభయ్ కరండికర్ అన్నారు.
చాలా మంది పేషంట్స్‌కు గుండె మార్పిడి చేసుకోమని సలహాలు ఇస్తున్నారన్నారు.
ఈ కృత్రిమ గుండె రోగులకు ఎంతో ఉపయోగపడుతుందని తేల్చి చెప్పారు.
ఇక, ఈ కృత్రిమ గుండె ట్రైల్స్ సక్సెస్ అయితే.. ఎంతో మంది గుండె పోటు రోగుల ప్రాణాలు నిలుస్తాయి.