ఈ రోజుల్లో చాలా మంది  పిల్లలు ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారం కంటే జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు.

జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావం కనిపిస్తోంది. శరీరంలో పోషకాహార లోపం ఏర్పడటమే కాకుండా పిల్లల ఎదుగుదల కూడా ఆగిపోతుంది.

తల్లిదండ్రులు  కొన్ని సులభమైన మార్గాల పాటిస్తే  పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఆపవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం...

పిల్లలు జంక్ ఫుడ్ తినకుండా ఉండాలంటే ముందుగా బయట తిండిని తగ్గించాలి. వారికి ఇష్టమైన ఆహారాన్ని ఇంట్లో తయారు చేసి తినిపించాలి.

పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ వంటి వాటిలో కూరగాయలను మిక్స్ చేయడం ద్వారా పిల్లలకు    ఇష్టమైన ఆహారాన్ని ఇంట్లోనే అందిచవచ్చు.

బయట కనిపించే జంక్ ఫుడ్ లేదా ఇతర ఆహార పదార్ధాలను ఇంట్లో వేరైటీగా చేసి పిల్లలకు వడ్డిస్తుండాలి.

దీంతో పిల్లలు కూడా ఇంటి ఆహారాన్ని ఎంజాయ్ చేసి బయటివి తినడం తగ్గించుకుంటారు.

పిల్లలు చాలా త్వరగా అందమైన,రంగురంగుల వస్తువుల వైపు ఆకర్షితులవుతారు.

ఇంట్లో చేసే ఆహారాన్ని, చిరు తిండ్లును రంగు రంగులుగా కనిపించేలా పిల్లలకి ప్లేట్ల్ లో అలంకరించి పెట్టాలి. 

ఇంట్లోనే ప్లేట్లో అందంగా అలంకరించిన రంగు రంగుల ఫ్రూట్ చాట్ పిల్లలకి ఆహారంగా అందించాలి.  

పిల్లలకు తరచుగా ఏదో ఒకటి తినాలనే కోరిక ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలు జంక్ ఫుడ్కు ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభిస్తారు. 

 పిల్లలకి బొమ్మల రూపంలో ఉండే ఆహారపదార్ధలపై కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే అలాంటి తినే పదార్ధాలు తయారు చేయాలి.

జంక్ ఫుడ్ తినాలనే కోరిక పిల్లల్లో కలిగినప్పుడు ఇంట్లోనే వారికి ఇష్టమైనవి తయారు చేసి పెడితే.. వారు  బయటి ఫుడ్ జోలికి వెళ్లరు.

పిల్లలకి ఎప్పటికప్పుడు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఉండండి. దీని వల్ల వారు జంక్ ఫుడ్ తినాలని అస్సలు పట్టుబట్టరు.

ఇలా తల్లిదండ్రులు తమ పిల్లలకి ఇంట్లో వెరైటిగా ఉంటూ ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తుంటే పిల్లలకు జంక్ ఫుడ్ పై ఆసక్తి చూపించరు.