టెక్నాలజీ వినియోగం పెరిగిపోవడంతో మనం ఫోన్లు, ల్యాప్ టాప్ లతోనే కుస్తీ పడుతున్నాం. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే కళ్లు ఎర్రబడతాయి.

ఇవి మాత్రమే కళ్లు ఎర్రబడటానికి కారణాలు అంటే కాదు. వేరే రీజన్స్ కూడా చాలానే ఉన్నాయి.

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఫోన్, ల్యాప్ ట్యాప్ తదితర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వినియోగం వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

కంటినిండా నిద్రలేకపోయినా సరే కళ్లు ఎర్రబడతాయి. ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నాసరే కళ్లు ఎర్రబడతాయి.

వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కళ్ల వాపు వస్తుంది. దీంతో కనుగుడ్డుపై సన్నని పొర ఏర్పడుతుంది. దీంతో కళ్లు ఎర్రబడటం సహా నొప్పి పుడుతుంది.

అలాంటప్పుడు మంటగా అనిపించడం సహా వాపు కూడా ఉంటుంది. ఇది వైరల్ కళ్ల కలకకు సంకేతాలు. ఇలా ఉన్నప్పుడు డాక్టర్ ని సంప్రదించాలి.

కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత దీని లక్షణాలు చాలాకాలం వరకు ఉంటాయి. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి.

ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారి కళ్లు కూడా ఎర్రబడతాయని నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ కళ్ల నుంచి శరీరంలోకి ప్రవేశించిన వారి కళ్లు ఎర్రబడతాయట. కరోనా వచ్చి తగ్గిన తర్వాత కళ్లు ఎర్రగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించండి.

ముక్కుకు సంబంధించిన అలెర్జీలతోనూ కళ్లు ఎర్రగా మారతాయి. దుమ్మ, ధూళి, పెంపుడు జంతువుల వెంట్రుకలు పీల్చడం వల్ల ముక్కు అలర్జీతో పాటు కళ్లు ఎర్రబడుతుంటాయి.

మీలో ఎవరైనా కాంటాక్ట్ లెన్సులు ఉపయోగిస్తే ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవాలి. పాతవి, పగిలిపోయినవి ఉపయోగించొద్దు.

వీటిలో మీరు ఏది పాటించకపోయినా సరే మీ కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్లు ఎర్రగా మారతాయి. నిద్రపోయేటప్పుడు లెన్సులు ధరించినా కళ్లు ఎర్రగా అవుతాయి.

ఎక్కువసేపు కంప్యూటర్, ల్యాప్ ట్యాప్ చూసినా కళ్లు పొడిబారుతాయి. కంటిరెప్పులు ఎక్కువసేపు వాల్చకపోవడం వల్ల కళ్లు డ్రై అయిపోతాయి.

అందుకే కళ్లని తరచూ మూస్తూ ఉండాలి. ఒకవేళ కళ్లు పొడిబారినట్లు అనిపిస్తే, ఐ డ్రాప్స్ ఉపయోగిస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు.