స్త్రీకి అమ్మతనంతోనే పరిపూర్ణత వస్తుంది. అదీకాక తల్లిదండ్రులు అయిన దంపతులు ఎప్పుడెప్పుడు అమ్మా.. నాన్న అని పిలిపించుకుందామా అని ఎదురుచూస్తుంటారు.
సహజంగానే చాలా మంది పసిపిల్లలు ఒక సంవత్సరం పడగానే ఎదో ఒకటి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు.
కానీ కొంత మంది పిల్లల్లో రెండు సంవత్సరాలు వచ్చినా గానీ మాట్లడలేరు. దాంతో తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలౌవుతుంది.
అయితే ఇలాంటి క్రమంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు.
మీ పిల్లలు త్వరగా మాట్లాడాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు అంటున్నారు.
చిన్న పిల్లలకు ఏ విషయాన్నైనా త్వరగా, సులభంగా గ్రహించే శక్తి ఉంటుంది.
కాబట్టి వారితో ఎక్కువగా మాట్లాడుతుంటే.. క్రమంగా వారు కూడా మాట్లాడ్డానికి ప్రయత్నిస్తారు.
ఇక పిల్లలు ఆట వస్తువుల కంటే తల్లి చెప్పే మాటలపైనే ఎక్కువ శ్రద్ద పెడతారు.
కాబట్టి మీరు ఆట వస్తువు పేరు, దాని గురించి చెప్పటం చేయాలి.
పిల్లలకు కథలు ఎక్కువగా చెప్పాలి. ఇలా చెప్పడంతో వారి మనసులో కొన్ని పదాలు బలంగా నాటుకుపోతాయి. దాంతో ఆ పదాలను పిల్లలు పలకడానికి ప్రయత్నం చేస్తారు.
పిల్లలతో తరచుగా అమ్మా, అత్త, నాన్న అనే పదాలను మనం అనిపిస్తునే ఉంటాం. అదీకాక వారితో ఇంట్లో పెంచుకునే కుక్క, పిల్లి అనే పదాలను కూడా పలికించాలి.
ఇక పిల్లలను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచకుండా.. అప్పుడప్పుడు పార్క్ లకు తీసుకెళ్తుంటే వారు ఆటోమెటిక్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.
అయితే మాట్లాడట్లేదని పిల్లలపై చేయి చేసుకోకండి. ప్రేమగా మీరు ఎక్కువ సేపు వారితో మాట్లాడుతూ.. మాట్లాడిస్తూ.. ఉంటే వారికి త్వరగానే మాటలు వస్తాయి.
మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ పిల్లలకు మాటలు రాకపోతే.. వెంటనే వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలి.