స్త్రీలు ముఖ్యంగా యువ‌తులు నెయిల్ పాలిష్ వేసుకునేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తుంటారు.

చాలా మంది ఆడవారు నెయిల్ పాలిష్‌ల‌ను త‌ర‌చూ మారుస్తుంటారు. 

కొంద‌రు అయితే రోజుకో నెయిల్ పాలిష్ వేసుకుని ఫ్యాష‌న్‌గా ఉన్నామ‌ని ఫీల‌వుతుంటారు. 

నెయిల్ పాలిష్‌ల వ‌ల్ల ఫ్యాష‌న్ ప‌రంగా ముందు వ‌రుస‌లో ఉన్నప్పటికీ ఆరోగ్యం ప‌రంగా చూసుకుంటే ప్రమాద‌మంట.

నెయిల్ పాలిష్‌ల వ‌ల్ల అధికంగా బ‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టుల ప‌రిశోధ‌నల్లో తెలిసింది.

ప్రస్తుతం మ‌న‌కు మార్కెట్‌లో దాదాపుగా అనేక రకాల  నెయిల్ పాలిష్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఏ నెయిల్ పాలిష్ లోనైనా స‌రే.. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉంటుంది. 

ఆ రసాయనం గోర్లకు అంటిన‌ప్పుటికి శ‌రీరంలోని హార్మోన్లు ప్రభావితం అవుతాయి. 

దీని వల్ల మ‌నం అధికంగా బ‌రువు పెరుగుతామ‌ని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్లలో అందుబాటులో ఉన్న 3 వేల ర‌కాలకు పైగా నెయిల్ పాలిష్‌ల‌ను సైంటిస్టులు ప‌రీక్షించారు.

ఈ పరిశోధనలో 49 శాతం వ‌ర‌కు నెయిల్ పాలిష్‌ల‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్ ఉంద‌ని తేల్చారు.

ఆ రసాయనం ఉన్న నెయిల్ పాలిష్ వేసుకోగానే కొన్నిగంటల్లోనే బ‌రువు పెరుగుతార‌ని సైంటిస్టులు తేల్చారు. 

డ్యూక్ యూనివ‌ర్సిటీకి చెందిన ప‌రిశోధ‌కులు నెయిల్ పాలిష్ పై అధ్యయ‌నం చేశారు.

సైంటిస్టులు చెబుతున్నది ఒక్కటే.. నెయిల్ పాలిష్ వేసుకునే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

జాగ్రత్తగా ఉండకుంటే  అధికంగా బ‌రువు పెరుగుతారని పరిశోధకులు అంటున్నారు.

నెయిల్ పాలీష్ వాడేవారు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిదని నిపుణలు అంటున్నారు!