ఈ రోజుల్లో ఫోన్ లేని మనిషి కనిపించడు. పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ మెంటైన్ చేస్తున్నారు.
అయితే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయడం తప్పు కాదు. కానీ వీటికి బానిసగా మారిపోతే మాత్రం లేనిపోని తిప్పలు తప్పవు.
స్మార్ట్ ఫోన్లకు బానిసలు కావడం వల్ల మానసిక, శారీరక సమస్యలు వస్తాయి. రోజంతా ఫోన్ తోనే గడపడం వల్ల శరీరంలో ఒత్తిడి పెరిగిపోతుంది.
ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్లు చాలా పెద్దవిగా ఉంటున్నాయి. రోజంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం వల్ల చేతివేళ్లు విపరీతంగా నొప్పి పెడతాయి.
తగ్గిపోతుంది లే అని చాలామంది లైట్ తీసుకుంటారు. కానీ దీని గురించి డాక్టర్స్ మాత్రం హెచ్చరిస్తున్నారు. దీర్ఘ కాలంలో ఇది వేలిని బలహీనపరుస్తుందని చెబుతున్నారు.
మొదట్లో వేళ్ల నొప్పి పెద్దగా అనిపించనప్పటికీ.. ఫ్యూచర్ లో మాత్రం వేళ్ల బలం తగ్గిపోయే ఛాన్సుంది. దీన్ని నివారించడం కోసం వేళ్లకు మసాజ్ చేయండి, వాటిని సాగదీస్తూ ఉండండి.
ఫోన్ ని ఎప్పుడూ చూడటం వల్ల మెడనొప్పి వస్తుంది. అది కిందకు వంగిపోయే ఛాన్స్ ఉంది.
దీని వల్ల మెడతో పాటు భుజాలపై ఒత్తిడి పడి నొప్పి వస్తుంది. దీన్ని నివారించడానికి.. ఫోన్ ని మీ కళ్లకు దూరంగా ఉంచండి.
18-24 ఏళ్ల వయసున్న యూత్ లో 84 శాతం మంది వెన్నునొప్పితో బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది.
ఒకవేళ మీకు వెన్నునొప్పిగా ఉంటే.. నిటారుగా నడవడానికి, కూర్చోవడానికి ప్రయత్నించండి.
రోజంతా ఫోన్, కంప్యూటర్, టీవీలు చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పడుతుంది. దీని వల్ల కళ్లు బలహీనంగా మారతాయి. పొడిబారుతాయి.
ఎలక్ట్రానికి వస్తువులు ఉపయోగించేటప్పుడు కళ్లు ఆర్పడం మర్చిపోతాం. దీంతో కళ్లు పొడిబారి.. అంటువ్యాధులు, ఇతర సమస్యలు వస్తాయి.
దీన్ని నివారించేందుకు ప్రతి 20 నిమిషాలకు ఓసారి 20 సెకన్లపాటు మీ కళ్లని రిలాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం.
గాడ్జెట్లను కూడా దూరంగా ఉంచండి. ఫోన్ లేదా ల్యాప్ ట్యాప్ బ్రైట్ నెస్ తగ్గించి వాడటం మంచిది.
స్మార్ట్ ఫోన్ ఎక్కువసేపు పట్టుకోవడం వల్ల మీ చేతులు వంగి ఉంటాయి. దీని వల్ల మోచేతి నొప్పి వస్తుంది. జలదరింపు ఉన్నా సరే దానికి కారణం ఫోనే అని అర్థం చేసుకోండి.
దీన్ని నివారించేందుకు వీలైనంతగా ఫోన్ వాడకాన్ని తగ్గించండి. చేతులకు స్ట్రెచింగ్ ఎక్సర్ సైజ్ చేయండి. దీంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
నోట్: ఫైన టిప్స్ పాటించేముందు డాక్టర్, నిపుణుల సలహా కూడా ఓసారి తీసుకోవడం ఉత్తమం.