ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

వైద్యులు సైతం వీటికి సరైన కారణాలు వెల్లడించలేకపోతున్నారు.

ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన యూరోపియన్ హార్ట్ జర్నల్‌ రిపోర్ట్‌ భయాందోళనలు కలిగిస్తోంది.

మనం తరచుగా వాడే పారాసిటమాల్‌ కారణంగా గుండెకు పెను ముప్పు ఉన్నట్లు ఈ జర్నల్‌ వెల్లడించింది.

పారాసిటమాల్.. మనం చాలా సాధారణంగా వినే ట్యాబ్లెట్ పేరు ఇది. ప్రతి ఇంట్లో సర్వ సాధారణంగా కనిపించే మాత్ర.

జ్వరం… ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పారాసిటమాల్‌ మింగుతాం.

ఇక  కరోనా కాలంలో మెడికల్ షాపుల్లో అత్యధికంగా అమ్ముడు పోయిన డ్రగ్ పారాసిటమాల్.

అయితే యూరోపియన్ హార్ట్ జర్నల్‌ రిపోర్ట్‌ చూశాక.. అకస్మాత్తుగా గుండె ఆగిపోవడానికి పారాసిటమాల్‌ ట్యాబ్లెట్స్‌ కూడా ఓ కారణం అని నమ్మక తప్పదు.

హార్ట్ అటాక్స్ కారణాల్లో బీపీ ప్రధానమైంది. మకి బీపీ పెరగడానికి ఉప్పులో ఉండే సోడియం.

ఆహారంలో  ఉప్పు ఎక్కువగా తీసుకుంటే అది గుండె, ఇతర ప్రసరణ వ్యవస్థలకు అవరోధకంగా మారుతుంది.

సాధారణంగా ఉప్పులో సోడియం మిళితం అయి ఉంటుంది. ఇక పారాసిటమాల్‌ అధిక వినియోగం.. ఈ సోడియం నిల్వలను పెంచుతున్నాయని హార్ట్‌ జర్నల్‌ వెల్లడించింది.

ఇలాంటి ట్యాబ్లెట్స్ ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో సోడియం నిల్వలు పెరిగి హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్టులకు కారణమవుతుంది జర్నల్‌ హెచ్చరిస్తోంది.

యూరోపియన్ హార్ట్ జర్నల్‌తో పాటు చైనాలోని సెంట్రల్ సౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కూడా ఇదే హెచ్చరిస్తున్నారు.

 సోడియం కలిగిన పారాసిటమాల్ క్రమం తప్పకుండా ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల గుండెపోటు, ఆగిపోయే ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు.

ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు 60 నుంచి 90 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 3,00,000 మంది వ్యక్తుల నుండి డేటాను విశ్లేషించారు.

వాస్తవంగా చెప్పాలంటే పారాసిటమాల్‌లో సోడియం నిల్వలు ఉంటాయి.  

అయితే ప్రజలకు దీని గురించి తెలియక.. వైద్య సూచనలు లేకుండా ఇష్టానుసారం మింగుతున్నారు.

ఫలితంగా శరీరలో సోడియం నిల్వలు పెరిగి అది కాస్త ప్రాణాంతకంగా మారుతోంది.

అవసరం ఉన్న సమయంలో, వైద్యుల సూచనల మేరకు పారాసెటమల్ వాడితే ఎలాంటి ప్రమాదం ఉండదు.

అయితే ప్రస్తుత కాలంలో కొందరు రోజుకు 6 నుంచి 10 పారాసిటమాల్‌ ట్యాబ్లెట్స్‌ వాడుతున్నారు.

ఇక దీనిలోనూ  పారాసెటమల్ 500 ఎంజీ అనేది టాప్. కానీ ఇప్పుడు అది 650 ఎంజీ వచ్చేసింది.

650 ఎంజీని కూడా  చాలా సాధారణ ట్యాబ్లెట్‌గా వినియోగించేస్తున్నారు జనాలు.

అంతేకాక వైద్యులు ప్రిస్కిప్షన్‌ అవసరం లేని మందుల్లోపారాసిటమాల్‌ ఉండటంతో దీని వాడకం మరింత పెరుగుతోంది.

ఇదే సోడియం నిల్వలు పెరగడానికి, ప్రాణాంతకం కావడానికి కారణమవుతోందంటున్నారు వైద్యులు

సోడియం నిల్వలు పెరిగితే గుండె పోటు రావడమే కాదు..కార్డియాక్ అరెస్టులు సైతం జరుగుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

కనుక అవసరం ఉన్న సమయంలో అది కూడా వైద్యులు సూచన మేరకు పారాసిటమాల్‌ వాడాలంటున్నారు.