అందానికి, సౌందర్యానికి మనమిచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అందులోనూ జుట్టుపై అందరకి అందరకి ఆసక్తే.
మహిళలకైతే మరీనూ. కురులు ఒత్తుగా, బలంగా ఉండడం కోసం మార్కెట్ లోకి వచ్చే అన్ని రకాల షాంపూలను వాడేస్తుంటారు.
మీరు కూడా ఇలానే వాడుతుంటే.. మీకో ప్రమాద హెచ్చరిక. డవ్, ట్రెస్మే వంటి యూనీలివర్ షాంపులలో క్యాన్సర్‌కు కారణమయ్యే అత్యంత ప్రమాదకరమైన కెమికల్ ఉన్నట్టు ఫుడ్ అండ్ డగ్ర్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది.
అక్టోబర్ 2021కి ముందు తయారు చేసిన అన్ని ప్రొడక్టులను యూనీలివర్ రీకాల్ చేస్తోంది. వీటిలో నెక్సస్ షాంపూ, ట్రెస్మే, డవ్ వంటి పాపులర్ బ్రాండ్లు చాలానే ఉన్నాయి.
ఈ షాంపూలలో బెంజీన్ అనే క్యాన్సర్‌కు కారకమయ్యే కెమికల్ ఉన్నట్టు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఈ వార్త బయటికి పొక్కగానే పర్సనల్ కేర్ ప్రొడక్టులలో ఏరోసోల్స్ సేఫ్టీపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
గత ఏడాదిన్నరగా ఎన్నో ఏరోసోల్ సన్‌స్క్రీన్లను కూడా మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నాయి
దీనిలో జాన్సన్ అండ్ జాన్సన్ న్యూట్రోజెన్, ఎడ్జ్‌వెల్ పర్సనల్ కేర్ కోకు చెందిన బనానా బోట్, ప్రొక్టెర్ అండ్ గ్యాంబుల్ కో సీక్రెట్, ఓల్డ్ స్పైస్, యూనీలివర్ సువేవ్.. ఇలా చాంతాడంత లిస్టు ఉంది.
ఈ ఘటనపై వాలిస్యూర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ లైట్ స్పందించారు. ‘మేము చూసింది బయటికి తెలిపాం.
ఏరోసోల్ డ్రై షాంపూలు మరియు ఇతర కన్జూమర్ ప్రొడక్టు కేటగిరీల్లో అత్యధికంగా బెంజీన్ కారకం ఉండటం దురదృష్టకరం.
మేము దీనిపై విచారణ చేపడుతున్నాం..’ అని పేర్కొన్నారు.
స్ప్రై ఆన్ డ్రై షాంపూలలో షాంపూలలో ఇలాంటి ప్రమాదకరమైన కారకాలను గుర్తించడం ఇది తొలిసారి కాదు.
గత డిసెంబర్‌లో కంపెనీ ప్యాంటీన్, హెర్బర్ ఎసెన్స్ డ్రై షాంపూలను కూడా రీకాల్ చేసింది
ఆ సమయంలో కూడా క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ వీటిల్లో ఉన్నట్టు గుర్తించింది.