ఇంట్లో ఏదైనా వంటకాలు నూనె    ఉపయోగించడం సర్వసాధారణం.

నూనె వేయకుండా దాదాపు ఏ వంట  కూడా చేయలేని పరిస్థితి. 

కొందరు నూనెను ఒకసారి  వినియోగించిన తరువాత భద్రపరచి  మళ్లీ మళ్లీ వినియోగిస్తుంటారు.

అయితే ఇలా వాడిన నూనెనే మళ్లీ  మళ్లీ వాడటం ఎంత ప్రమాదకరం.

అలాంటి నూనె వల్లన ప్రాణాలకే  ప్రమాదం ఉందని నిపుణులు  చెబుతున్నారు. 

వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడటం  వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు  తెలుసుకుందాం..

ఈ నూనె వలన శరీరంలో మంచి  కొలెస్ట్రాల్ తగ్గడం మొదలవుతుంది. 

చెడు కొలెస్ట్రాల్ పెరిగి అధిక బిపి,  గుండె జబ్బుల ప్రమాదం  గణనీయంగా పెరుగుతుంది.

ఉపయోగించిన వంట నూనె గుండెకు  హాని కలిగించే  ఆల్డిహైడ్స్ వంటి  అనేక విష పదార్థాలను విడుదల చేస్తుంది.

ఈ వంట నూనె వలన కడుపులో మంట,  గ్యాస్ సమస్యలు వస్తాయి. 

అందుకే బయట ఆహారం తినడం వల్ల  తరచుగా ప్రజలు ఇబ్బందులకు  గురవుతుంటారు.

వినియోగించిన వంట నూనె వలన చెడు  కొలెస్ట్రాల్ పెరిగి గుండెపోటు వచ్చే  ప్రమాదం ఉంది.

అందుకే  వంటకు సరిపడా నూనె  ఉపయోగించాలి. దాదాపు మిగలకుండా  చూసుకోవాలి.

పొద్దుతిరుగుడు, ఆవాలు, సోయాబీన్ నూనె,  వేరుశెనగ లేదా నువ్వుల నూనెను  ఉపయోగించండి. 

కూరగాయలు వేయించడానికి  నెయ్యి, కొబ్బరి నూనెను  ఉపయోగించడం మంచిది. 

అయితే, మళ్లీ మళ్లీ దానినే  వినియోగించడం సరికాదని  గుర్తుంచుకోవాలి.