ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా బాత్రూం లోకి మొబైల్ ఫోన్లు తీసుకుని వెళ్తున్నారు. అంతే కాకుండా గంటల తరబడి ఫోన్ తో కాలక్షేపం చేస్తున్నారు.

అలా చేయడం ద్వారా అనేక రోగాల బారిన పడడమే కాకుండా లేని పోని అనారోగ్య సమస్యలను దగ్గర చేస్తుందట. 

వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది ముమ్మాటికి నిజమేనని వైద్య నిపుణులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

బాత్రూంలో ఎక్కువ సేపు ఫోన్ వాడడం ద్వారా వచ్చే సమస్యలు ఏంటి? అసలు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ తప్పక చదవాల్సిందే.

ఈ రోజుల్లో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్ ఉండడం, పైగా తక్కువ ధరకే అధిక డేటా దొరుకుతుండడంతో ప్రతీ ఒక్కరు సోషల్ మీడియాలో వాలిపోతున్నారు.

 తినేటప్పుడు, పడుకునేటప్పుడు చివరికి బాత్రూంలోకి కూడా మొబైల్ ఫోన్ ను వెంట తీసుకెళ్లి అందులో చాలా సమయం గడుపుతున్నారు.

బాత్రూంలో మొబైల్ ఫోన్ వాడడం అనేది చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

బాత్రూంలో టాయిలెట్ సీటుపై పది నిమిషాలకు మించి కూర్చోవడం చాలా ప్రమాదకరమని నిపుణులు సూచిస్తున్నారు. 

టాయిలెట్ లో మన కంటికి కనిపించని ఎన్నో రకాల హానికరమైన క్రిములు ఉంటాయి. అవి మన శరీరంపై ఎక్కువగా ప్రభావం చూపే ఆస్కారం లేకపోలేదట. 

అంతేకాకుండా టాయిలెట్ లో ఎక్కువ సేపు కూర్చునే వారికి పైల్స్ వచ్చే అవకాశం కూడా ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చుంటే మలబద్దం సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉందట. 

అంతేకాకుండా మరిన్ని అనారోగ్య సమస్యల పాలవ్వాల్సి వస్తుందని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక ఇప్పటి నుంచైనా బాత్రూంలోకి వెళ్లే ముందు ఫోన్ తీసుకు వెళ్లకుండా ఆరోగ్యంగా ఉండండి అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.