మిగతా వంట నూనెలతో పోలిస్తే పామాయిల్ ధర తక్కువగా ఉంటుంది.

అందుకే చాలా మంది పామ్ ఆయిల్ ని ఎక్కువగా వినియోగిస్తుంటారు.

తక్కువ రేటు ఉంటుంది కాబట్టి రెస్టారెంట్లలో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఎక్కువగా పామాయిల్ నే వినియోగిస్తారు.

చాలా మంది జంక్ ఫుడ్ తింటుంటారు. అయితే వీటిలో దాదాపు పామాయిల్ తో చేసినవే ఉంటాయి.

పామాయిల్ తో చేసిన ఫుడ్ తినడం వల్ల చాలా ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు.  

ఇంట్లో కూడా పామ్ ఆయిల్ వాడుతుంటారు. దీని వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

మద్యం, సిగరెట్ తాగితే వచ్చే నష్టాల కంటే పామాయిల్ వాడటం వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ అని చెబుతున్నారు.

పామాయిల్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

చిన్న పిల్లలు పామాయిల్ తో చేసిన ఆహారం తింటే చిన్న వయసులోనే డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది.

పామాయిల్ వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది.

చిన్నపిల్లలకు మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

పెద్ద పెద్ద కంపెనీలు బిస్కెట్లు, కుకీలు, చాక్లెట్లు వంటి వాటిలో పామాయిల్ నే వాడుతున్నారు.

పామాయిల్ లేదా పాల్మిటిక్ యాసిడ్ వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు.

ఏవైనా వస్తువులు కొనే ముందు ఆ వస్తువుల్లో పామాయిల్, పాల్మొలినిక్ ఆయిల్, పాల్మిటిక్ యాసిడ్ వంటివి ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.