నిమ్మకాయలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుందనే విషయం మన అందరికీ తెలిసిందే.
నిమ్మకాయలో రోగనిరోదక శక్తిని పెంచే గుణాలు కూడా ఉంటాయి.
ఇక ఇదే కాదండోయ్.. నిమ్మకాయ తొక్కతో కూడా బోలేడు లాభాలు దాగి ఉన్నాయట.
నిమ్మకాయ తోక్కే కదా అని అందరూ దానిని తేలికగా తీసి పాడేస్తుంటారు.
అసలు నిమ్మకాయ తొక్కతో లాభాలు ఏంటి? ఆయూర్వేద నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తిని పెంచడంలో నిమ్మకాయ తొక్క అద్భుతంగా పని చేస్తుంది.
ఇది జీర్ణశక్తిని మెరుగు పరిచేందుకు దోహదపడుతుంది.
కొన్ని నిమ్మకాయ తొక్కలను ఎండబెట్టాలి. ఆ ఎండబెట్టిన ఆ తొక్కలను పేస్ట్ లా చేసి అందులో కొద్దిగా తేనే కలుపుకుని ముఖానికి రాసుకుంటే ముడతలు, మచ్చలు తొలగిపోతాయి.
పళ్లు తలతల మెరవాలంటే నిమ్మకాయపొడిలో కాస్త ఉప్పు కలిపి పళ్లపై రాస్తే పళ్లు తెల్లగా మెరుస్తాయి.
నిమ్మకాయ తొక్కలో మెగ్నిషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి.
ఇవి శరీరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
నిమ్మకాయ తొక్కలో ఉండే పెక్టిన్ వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గించుకోవవచ్చని ఆయూర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.
నిమ్మకాయ తొక్క పొడిని గ్రీన్ టీలో కలుపుకుని తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
ఇక నుంచి నిమ్మకాయ తొక్కే కదా అని తేలికగ తీసిపారేయకుండా పైన తెలిపనట్లుగా ట్రై చేసి ఆరోగ్యంగా ఉండండి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలం నుండి సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.