శరీరంలోని జీవక్రియ ప్రక్రియలను థైరాయిడ్ గ్రంథి నియంత్రిస్తుంది. ఈ గ్రంథి శరీరంలోని ప్రతి కణానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంధికి సాధారణంగా రెండు రకాల సమస్యలు ఉంటాయి.
అవి హైపోథైరాయిడిజం మరియు హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ గ్రంధి సమస్యలు ఉంటే, అది శరీరం యొక్క మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
ఈథైరాయిడ్ సమస్య వల్ల బరువు త్వరగా తగ్గి.. ఆకలి వేస్తుంది. థైరాయిడ్ సమస్య వస్తే డాక్టర్ను సంప్రదించడంతో పాటూ.. కొన్ని ఆహార పదార్ధలను తీసుకుంటే మంచిది.
థైరాయిడ్ గ్రంథి పనితీరుపై బాగుండేందుకు బి విటమిన్స్ ఉపయోగపడతాయి. కాబట్టి రోజు ఆహారంలో భాగం బి విటమిన్స్ ఉంటే ఆహార పదార్ధాలు తీసుకుంటే మంచిది.
థైరాయిడ్ సమస్యకు చాలా కారణాలు ఉంటాయి. వాటిల్లో అయోడిన్ లోపం ఒకటి. కనుక అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారం తినాలి. అయోడిన్ ఉప్పునే వాడాలి. అలాగే చేపలు, రొయ్యలు, ఆలు, అరటిపండ్లను తిన్నా శరీరానికి అయోడిన్ అందుతుందట.
థైరాయిడ్ సమస్యను నియంత్రించే వాటిల్లో అవిసె గింజలు కూడా ఒకటి. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ పనితీరును మెరుగు పరిచి.. థైరాక్సిన్ కావాల్సినంత మాత్రమే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి.
వాల్నట్స్లో మెగ్నిషియం పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగు పరుస్తాయి. వీటి ద్వారా శరీరానికి కావాల్సినంత థైరాక్సిన్ అందుతుంది.
అల్లం వలన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. అల్లాన్ని ఆహారంలో తీసుకుంటే చాలా మంచిది. ఇంకా కుదిరితే రోజూ ఉదయానే ఓ స్పూన్ అల్లం రంసం తేనేతో కలిపి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. థైరాయిడ్ సమస్యను అల్లం తగ్గిస్తుంది.
యాపిల్ పండ్లతో ఈ వెనిగర్ ను తీసుకుంటే థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఓ గ్లాస్ వేడి నీళ్లలో రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ కలిపి రోజుకోసారి తీసుకుంటే మంచిది. థైరాయిడ్ సమస్యతో పాటు శరీర దుర్వాసన సమస్యను నివారించడంలో ఇది ఉపయోగపడుతుంది.
అశ్వగంధ పొడి కూడా మంచిదే. రోజూ ఓ టీస్పూన్ తీసుకొని.. ఓ గ్లాస్ నీటిలో కలిపి రెండు సార్లు తాగితే బెటర్. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన థైరాక్సిన్ అంది.. థైరాయిడ్ పనితీరు మెరుగు పడుతుంది.
థైరాయిడ్ సమస్యల నివారణకు కొబ్బరి నూనె బాగా ఉపయోగపతుంది. నూనెలో మన శరీరానికి ఉపయోగపడే ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి.
ఇది కూడా థైరాయిడ్ సమస్యను నివారిస్తుంది. అయితే మార్కెట్లో దొరికే ఈ ఫిష్ ఆయిల్ను.. వైద్యుల సలహా మేరకు వాడుకుంటే మంచిది. దీన్ని ఉపయోగిస్తే.. శరీరానికి కావాల్సిన ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. ఇందులోని ఒమెగా 3 ఉంటుంది. ఇలా పై వాటిని ఉపయోగిస్తూ థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చు.