మధ్యకాలంలో కాలంలో గుండెపోటుతో సంభవించే మరణాల బాగా పెరిగాయి.
వయసుతో సంబంధం లేకుండా యువకులకు సైతం గుండెపోటు వస్తుంది.
అయితే చాలా మందికి గుండె పోటు లాంటిదే కంటి స్ట్రోక్ ఉందని తెలియదు.
మరి.. కంటి స్ట్రోక్ లక్షణలు ఎలా ఉండాయే ఇప్పుడు తెలుసుకుందాం..
మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాల్లో కళ్లు ఒకటి.
కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉంటాయో... మనమూ అంతే ఆరోగ్యంగా కనిపిస్తాము.
చాలా మంది కళ్ల విషయంలో చాలా అజాగ్రత్తగా ఉంటారు. ఆ నిర్లక్ష్యం ఏ మాత్రం మంచిది కాదు.
ఎందుకంటే గుండెపోటు లాగా ఐ స్ట్రోక్ వచ్చే ప్రమాదాలపై వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇది ఆప్టిక్ నరాల ముందు భాగంలోని కణజాలాలకు తగినంత రక్త ప్రవాహం లేకపోవడం వల్ల ఈ స్ట్రోక్ సంభవిస్తుంది.
నొప్పి లేకుండానే ఉదయం నిద్రలేవగానే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
కంటి దృష్టిలో అస్పష్టత, చీకటి, నీడలు లాంటి ఆకస్మిక మార్పులు ఐ స్ట్రోక్ కి సంకేతాలంట
ప్రోటీన్లతో కూడిన ఆహారం తినడం, మన రక్తంలో చక్కెర, ఒత్తిడి స్థాయిలను పరీక్షించడం చేయాలని నిపుణులు అంటున్నారు.
స్మోకింగ్ మానేయాలి, అధికంగా మద్యం సేవించడం తగ్గించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కార్డియోవాస్క్యులార్ వ్యాధి ఉన్నవారు ఐ స్ట్రోక్ బారిన పడే అవకాశాలున్నాయిని వైద్యులు చెబుతున్నారు
అధిక బీపీ కలిగి ఉండటం, డయాబెటిస్, గ్లాకోమా ప్రాబ్లెమ్స్ ఉన్నవాళ్లు ఈ ఐ స్ట్రోక్ కు జోన్‌లో ఉన్నారంట.
అకస్మాత్తుగా దృష్టి కోల్పోయే వ్యక్తులు వెంటనే, ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలి.