అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చలికాలంలో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి.
వెల్లుల్లి దగ్గు, జలుబు వంటి సమస్యలతోపోరాడుతుంది. వెల్లుల్లిని డైరెక్ట్ గా లేదా చికెన్ సూప్ లో వేసుకుని తింటే మంచి ఫలితాలు ఉంటాయి.
వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డైట్ లో భాగం చేసుకోవచ్చు.
అడవి తేనె యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జలుబుని నియంత్రిస్తుంది.
పాలలో పసుపు కలుపుకుని తాగితే గొంతులో మంటతో పాటు దగ్గు తగ్గుతుంది.
నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. లెమన్ టీ లేదా వేడి లెమన్ వాటర్ తాగడం వల్ల గొంతు మంట, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
బాదంలో దగ్గు, జలుబుని నియంత్రించే లక్షణాలు ఉంటాయి. బాదం స్కిన్ పై ఉండే
పాలీఫెనాల్స్, వ్యాధితో పోరాడే సమ్మేళనాలు తెల్ల రక్తకణాల సున్నితత్వం కోసం పని చేస్తాయి. ఇవి వైరస్ లతో వేగంగా, సమర్థవంతంగా పోరాడతాయి.
నోట్: పైన చెప్పిన చిట్కాలు పాటించేముందు ఓసారి డాక్టర్, నిపుణుల సలహా కూడా తీసుకోండి.