బరువు తగ్గాలని తినడం మానేస్తే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇలా చేయడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందవు.

ఏమీ తినకుండా ఎక్కువ సేపు ఉండడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. 

చర్మం నిర్జీవంగా తయారవుతుంది. 

కొంతమంది ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. 

దీని వల్ల డీహైడ్రేషన్ కి గురవుతారు. దీని వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే అవకాశం ఉంది. 

కడుపు మాడ్చుకుని ఉండడం వల్ల శరీరంలో జీవక్రియ వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇది అనేక సమస్యలకు దారి తీస్తుంది. 

తినడం మానేస్తే శరీరంలో శక్తి క్షీణిస్తుంది. 

బరువు తగ్గడం కోసం తినడం మానేయడం కంటే ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం. 

దీని వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. 

ఫైబర్ కంటెంట్ వల్ల కడుపు నిండుగా ఉంటుంది. దీని వల్ల తక్కువ ఆహారం తింటారు.

ఈ కారణంగా ఎలాంటి సమస్యలు లేకుండా బరువు తగ్గుతారు.

ఇక బరువు తగ్గాలనుకునేవారు ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకూడదు. ఇవి బరువుని అమాంతం పెంచేస్తాయి. 

పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బరువు తగ్గించడంలో దోహదపడతాయి.