వృద్ధాప్యం అనేది ఎవరూ ఆపలేనిది. ఇది పుట్టిన ప్రతీ మనిషికి వస్తుంది.
కానీ చాలా మందికి చిన్న వయసులోనే ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి.
ముఖంపై ముడతలు వచ్చినట్లు కనిపిస్తే చాలు.. ఇక భయపడిపోతుంటారు.
అయితే ఇలాంటి వారు ఖచ్చిమైన ఆహార నియామవళిని పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖంపై తొందరగా వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలి?
అసలు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
చిన్న వయసులోనే చాలా మందికి ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తూ ఉంటాయి.
మన ముఖ చర్మంపై ఉండే కెరాటిన్ చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇక చర్మంపై కెరాటిన్ ఎప్పుడైతే దెబ్బతింటుందో అప్పుడు ముఖంపై ముడతలు, గీతలు రావడం మొదలై వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి.
ఇలాంటి వారు ఆహారంలో అప్పుడప్పుడు కెరాటిన్ ఉత్పత్తి చేసే పొద్దు తిరుగుడు విత్తనాలు తీసుకోవాలి.
యాసిడ్, సెలినియం, కాపర్ ఎక్కువగా ఉండే ఇవి తీసుకోవడం ద్వారా చర్మం కాంతివంతంగా ఉంచడంతో పాటు ముఖంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా సహాయపడతాయి.
ఆకుకూరలు, క్యాబేజీ, మరిన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలి. చిలగడదుంపను కూడా అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇందులో కెరాటిన్ తయారు చేసే గుణాలు ఉంటాయి.
గుడ్లు, క్యారెట్లు తీసుకోవడం ద్వారా కూడా చర్మంపై ఉండె కెరాటిన్ తయారికి ఉపయోగపడతాయి.
పైన తెలిపిన ఆహారపదార్థాలు తీసుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలు తగ్గించడంతో పాటు జుట్టు కుదుళ్లకు కూడా రక్షణను ఇస్తాయి.
గమనిక: ఇది కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం వైద్యులను, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.