పిల్లలకు మంచి నడవడిక, విలువలు నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత. ఈ క్రమంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల పట్ల పలు సందర్భాల్లో కఠినంగా వ్యవహరిస్తారు.

ఇలా చేయడం వల్ల ఆ నిమిషం పిల్లలు భయపడటం, మారడం చేయవచ్చేమో కానీ.. అది వారిలో ద్వేషాన్ని నింపుతుంది.

అందుకే పిల్లలు తప్పు చేసినప్పుడు.. కఠినంగా ఉండి, శిక్షించడం కన్నా కూడా ఇలా చేస్తే.. 

వారు తప్పులు తెలుసుకునే వీలుండటమే కాక.. తల్లిదండ్రులపై గౌరవం పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

ఓపిక అవసరం పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే కోపంగా అరవడం, కొట్టడం వంటివి చేయకూడదు. సహనంగా ఉండాలి

పిల్లలను పక్కకు తీసుకువచ్చి.. వారు ఏం తప్పు చేశారో వివరించి.. దాని వల్ల కలిగే పరిణామాల గురించి వారు ఆలోచించడానికి సమయం ఇవ్వాలి.

మాట వినండి పిల్లలు మాట్లాడుతుంటే చాలా మంది తల్లిదండ్రులు కామ్‌గా ఉండు అని కోపగించుకుంటారు.

మరి కొందరు పిల్లలు తెలిసి తెలియక పెద్దవారు మాట్లాడే మాటలు మాట్లాడితే వెంటనే శిక్షించడానికి రెడీ అవుతారు.

కానీ అలా చేయవద్దు అంటున్నారు నిపుణులు. దానికి బదులు పిల్లలు చెప్పే మాటలు వినాలి. తప్పుగా మాట్లాడితే.. ఎందుకు అలా మాట్లాడుతున్నారో.. ఎక్కడ విన్నారో తెలుసుకోవాలి.

పిల్లల్లో మాటల్లో దొర్లే తప్పుల గురించి చెప్పి.. ఎందుకలా మాట్లాడకూడదో వివరించాలి. అంతేకాక దీనివల్ల పిల్లలు ఏ విషయాల పట్ల ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది అంటున్నారు నిపుణులు.

మంచిని ప్రశంసించండి పిల్లలు తప్పు చేస్తే.. దాన్ని ఎత్తి చూపి.. వాటి గురించి వివ

అలానే పిల్లలు చేసే మంచి పనులను ప్రశంసించడం కూడా చేయాలి. వారి మంచి ప్రవర్తన, నడవడికను మెచ్చుకోవాలి

ఇలా చేయడం వల్ల పిల్లలకు మంచి, చెడుల మధ్య వ్యత్యాసం, దాని వల్ల కలిగే పరిణామాలు అర్థం అవుతాయి. 

వాస్తవపరిస్థితులను వివరించాలి పిల్లలకు చిన్నతనం నుంచే ఏది వాస్తవమో.. కాదో వివరించాలి. మరీ ముఖ్యంగా టీవీలో చూపించే ప్రకటనలు పిల్లల్ని ఆకర్షిస్తాయి. 

వాటి గురించి పిల్లలకు వాస్తవాలు తెలపండి. అలానే ఇంట్లో తలెత్తే సంఘటనల గురించి కూడా పిల్లలకు వీలైనంత వరకు నిజాలు చెప్పే ప్రయత్నం చేయండి అంటున్నారు నిపుణులు.