శరీరంలో కొన్ని రకాల భాగాలకు కొన్ని రకాల ఫుడ్స్ వల్ల మేలు కలుగుతుంది. అలా అని వాటిని ఎక్కువగా తిన్నాసరే డేంజరే.
అలాంటి వాటిలో ప్లాక్స్ సీడ్స్ కూడా ఒకటి. అవిసె గింజలుగా పిలిచే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు తప్పవు.
ఈ అవిసె గింజల వల్ల కలిగే దుష్ప్రభావాలు ఏంటి? వీటిని తీసుకోవడం ఎంత వరకు సురక్షితం అన్న విషయాల ఇప్పుడు చూద్దాం.
డయేరియా, ప్రేగుల్లో సమస్యలు, కడుపులో సమస్యలు, షుగర్ వ్యాధి లాంటి చాలా అనారోగ్యాలకు వీటిని ఔషధంగా ఉపయోగిస్తారు.
కిడ్నీ, ADHD, షుగర్, బరువు తగ్గడం, డిప్రెషన్, మలేరియా, ఆర్థరైటిస్, దగ్గు, గొంతునొప్పి సమస్యల నివారణలో వీటి వినియోగం ఎక్కువ.
అవిసె గింజల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఆహారం తినే ముందు వీటిని తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తాయి.
అయితే అవిసె గింజల్ని ఎక్కువగా తింటే జీర్ణసంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్దకం, ఎక్కువగా మల విసర్జనకు వెళ్లాల్సి రావడం, అజీర్తి వంటి సమస్యలు వచ్చే ఛాన్సుంది.
ఉడికించని, వేయించని అవిసె గింజలను తీసుకోవడం చాలా ప్రమాదకరం. ఇవి ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతాయి.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు ఇవి ఇబ్బందులను తెచ్చి పెడతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ లా పనిచేస్తాయి. కాబట్టి ఇవి గర్భంపై ఎఫెక్ట్ చూపించే ఛాన్సుంది.
అయితే దీనికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. అయినప్పటికీ గర్భిణిలకు సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజల వల్ల కొన్నిసార్లు పలురకాల క్యాన్సర్ లకు కూడా రావొచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
తగినంత ద్రవ పదార్థం లేకుండా అవిసె గింజలను తీసుకోవడం వల్ల ప్రేగు సమస్యలు తలెత్తుతాయి. కొందరిలో అలర్జీలు వచ్చే అవకాశం ఉంది.
వీటిని అధికంగా తీసుకోవడం వల్ల పొత్తి కడుపులో నొప్పి, శ్వాస సంబంధిత సమస్యలు, వికారం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది.
కనుక వీటిని వైద్యుల సూచనల మేరకు తగిన మోతాదులో తీసుకోవాలి.
నోట్: పైన టిప్స్ పాటించేముందు మీ దగ్గర్లోని డాక్టర్, నిపుణులు సలహా కూడా తీసుకోండి.