కాకపోతే.. ఆలస్యంగా లేటు వయసులో పిల్లలకు జన్మనివ్వడం వల్ల.. వారు ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉంటారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఇక 30 ఏళ్ల తర్వాత గర్భం దాలిస్తే.. తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి.
లేటుగా గర్భం దాల్చిన వారి విషయంలో మొదటి 2 నెలలు ఎంతో కీలకం. కనుక డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ.. వారి సూచనలు, సలహాలు పాటించాలి.
అలానే వయసు పైబడిన కొద్ది.. మహిళల్లో శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి. కనుక తప్పకుండా పోలిక్ యాసిడ్, విటమిన్స్, ఐరన్ మాత్రలు వాడటం మంచిది.
ఇది కేవలం తల్లికి మాత్రమే కాక.. బిడ్డ ఎదుగుదలకు కూడా ఎంతో దోహదం చేస్తుంది.
ఏ వయసులో గర్భం దాల్చిన సరే.. సరైన పోషాకాహారం తీసుకోవడం తప్పనిసరి.
కనుక మాంసం, గుడ్లు, చేపలు, బ్రకోలీ, తృనధాన్యాలు వంటి ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
గర్భదారణ సమయంలో సుమారు 12 కేజీల వరకు బరువు పెరగాలి.
ఇక 35 సంవత్సరాల తర్వాత గర్భం దాల్చిన మహిళలు.. రోజుకు కనీసం ఓ అరగంటకు పైగా నడవడం ఎంతో మంచిది.
అంతేకాక మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని తక్షణమే మానుకోవాలి అని సూచిస్తున్నారు నిపుణులు.