మనిషి ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఎన్నో అంశాల్లో నిద్ర కూడా ఒకటి.

కంటికి సరిపడినంత నిద్రలేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

అయితే వాస్తవానికి నిద్రలేమి మాత్రమే కాదు, అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరమే.

సాధారణంగా మనిషికి 6 నుంచి 8 గంటల నిద్ర సరిపోతుంది.

అయితే కొందరు ఖాళీగా ఉన్నాం కదా అని అదే పనిగా నిద్రపోతారు.

అతిగా నిద్రపోయే వారిలో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు.

అతి నిద్ర వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

అతి నిద్ర వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో మనం ఇప్పుడు చూద్దాం..

అతినిద్ర గుండె జబ్బులకు దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అవసరమైన దానికంటే నిద్ర ఎక్కువైతే హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని పలు అధ్యయనాలు తెలిపాయి.

అతినిద్ర గుండెకపై పరోక్షంగా ప్రభావ చూపిస్తుందని ఆరోగ్య నివేదికలు చెబుతున్నాయి.

అలానే అతినిద్రకు డయాబెటిస్ కు పరోక్ష సంబంధం ఉంది.

అతిగా నిద్రించడం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంట.

ఊబకాయానికి అతినిద్ర కూడా ఓ ప్రధాన కారణమని వైద్యులు అంటున్నారు.

 కాబట్టి మీకు నిత్యం అతిగా నిద్ర వస్తూ ఉంటే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.