చాలా మంది నిద్రలేవగానే మంచం పై నుంచి కాళ్లు కింద పెడతారు. దాంతో కాళ్లకు రక్తం చేరిపోయి నొప్పి వస్తుందట.
పైగా ఇలా లేవగానే కాళ్లు కింద పెట్టడంతో వెన్నముక కండరాలు దెబ్బతింటాయని వైద్యులు చెబుతున్నారు.
అందుకే కళ్లు తెరచిన వెంటనే లేవకుండా కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవాలంటున్నారు నిపుణులు.
ఆ తర్వాత శరీరాన్ని అన్ని దిశల్లో వంచాలని సూచిస్తున్నారు.
ఇక మహిళలకు ఇంట్లో బోలెడన్ని పనులుంటాయి. దాంతో ఉదయం లేవగానే హడావిడిగా కిచెన్ లోకి పరిగెడుతుంటారు. ఇలా చేయడం అతి పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు.
వ్యాయామం చేయడానికి ఉదయమే సరైన సమయం. కానీ కొంత మంది టైమ్ లేదని సాయంత్రం చేస్తారు. ఇది మంచి పద్దతి కాదంటున్నారు నిపుణులు.
ఇక లేచిన తర్వాత 40 నిమిషాల నుంచి గంట లోపల కోడిగుడ్లు, పండ్లు, నట్స్ లాంటివి ఏదో ఒకటి తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
అదీ కాక హడావుడిగా బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల.. మధ్యాహ్నామే శక్తి అయిపో శరీరం నిరసంగా తయ్యారవుతుందట.
ఉదయం లేచిన వెంటనే ఈ పనులు చేయకుండా ఉంటే రోజంతా ఉత్సాహాంగా ఉంటారంటున్నారు వైద్యనిపుణులు.