మ‌నం స‌హ‌జంగానే రోజూ వంట‌ల్లో  ఆవాల‌ను  ఉపయోగిస్తుంటాము.

ఆవాలు లేదా ఆవ పిండిని వంట‌ల్లో వేయ‌డం వ‌ల్ల వంట‌ల‌కు చ‌క్కని రుచి, వాస‌న వ‌స్తాయి. 

అయితే వాస్తవానికి ఆయుర్వేదం ప్రకారం ఆవాలు మ‌న‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి. 

ఆవాల‌ వలన మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆవాల్లో ఆరోగ్యక‌ర‌మైన విట‌మిన్లు ఎ, బి1, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె లు ఉంటాయి.

జింక్, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి మిన‌ర‌ల్స్ కూడా ఆవాల్లో ఉంటాయి. 

ఇక ఆవాల పొడిని వంట‌ల్లో వాడ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంది.

ఆవాల వాడకం వల్ల మెద‌డు యాక్టివ్‌గా మారి..ఏకాగ్రత‌, జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతాయి.

బెల్లంలో కొన్ని పల్లీలు, ఆవాలు వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. 

వాటిని ఉండలుగా చేసుకుని రోజుకు ఒకటి తీసుకుంటే ఆస్తమా వ్యాధికి చెక్ పెట్టవచ్చు.

ఆవనూనెను తలకు పట్టిస్తే జట్టు రాలకుండా ఉంటుంది. అలానే చుండ్రు సమస్య కూడా పోతుంది.

ఆవాల పొడిలో కొద్దిగా కొబ్బరినూనె కలిపి తలకు రాసుకుని గంట తర్వాత తలస్నానం చేయాలి.

ఆవాల పొడిలో కొద్దిగా నెయ్యి, ఒక టీస్పూన్ తేనె కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. 

ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుపూటలా తీసుకుంటే అస్తమా, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. 

ఆవాల పొడిని కడుపు ప్రాంతంలో రాసుకుంటే వాంతులు తగ్గుతాయి. 

ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి.

ఇలా ఆవాల‌తో మ‌నం ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో సేకరించింది మాత్రమే. దీని మీద అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.