ప్రోటీన్ల‌ను త‌క్కువ ధ‌ర‌లో అందించే ఆహారాల్లో కోడిగుడ్లు ప్రధానమైనవి.

గుడ్లలో పోషక విలువలు మెండుగా ఉంటాయి. 

అందుకే ప్రతిరోజు గుడ్లు తినే వారు ఈ సమాజంలో ఉన్నారు. 

ప్రతిరోజు షాపునకు వెళ్లి తెచ్చుకోవటం ఇబ్బంది కాబట్టి.. 

డజనో.. రెండు డజన్లో ముందే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు.

ఇక, ఫ్రిజ్‌ ఉన్న వాళ్లు వాటిని ఫ్రిజ్‌లో రోజుల తరబడి దాస్తుంటారు.

అయితే, అలా దాచడం వల్ల అనారోగ్యాల బారిన ప‌డాల్సి వ‌స్తుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.

గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉంచిన గుడ్ల‌తో పోలిస్తే ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు త్వ‌ర‌గా పాడవుతాయి.

ఫ్రిజ్ లో నిల్వ చేసిన గుడ్లు పుల్ల‌గా మారతాయి.

ఫ్రిజ్ లో ఉంచిన గుడ్లు గడ్డకట్టి పెంకుపై బ్యాక్టీరియా అభివృద్ది చెందే అవ‌కాశం ఉంది.

ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనారోగ్యానికి గురి అయ్యే అవ‌కాశం చాలా ఉంది.