ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు చాలా మంది సడెన్ గా గుండెపోటుతో చనిపోతున్నారు.

మరీ ముఖ్యంగా జిమ్ముల్లో వ్యాయామాలు చేస్తూ కుప్పకూలుతున్నారు.

అసలు వ్యాయమం చేస్తుంటే గుండెపోటు ఎందుకు వస్తుందో అది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కండరాలను పెంచేయాలని ఉద్దేశ్యంతో కాకుండా.. ఆరోగ్యం కోసం మాత్రమే జిమ్ చేయాలని చెబుతున్నారు.

ముఖ్యంగా ఆరోగ్యం బాగలేనప్పుడు వ్యాయామం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.  

ఎందుకంటే ఇలాంటి సమయంలో వ్యాయామాలు చేస్తే.. గుండె పోటు వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. 

మోతాదుకు మించి వ్యాయామాలను చేయడం ప్రాణాలకే ప్రమాదమంటున్నారు వైద్యులు.

జ్వరం వచ్చినా మీరు అలాగే వ్యాయమం చేస్తే.. మీ బాడీలో వాటర్ కంటెంట్ తొందరగా తగ్గిపోతుంది.

ఫీవర్ గా ఉన్నా ఎక్సర్ సైజెస్ చేస్తే.. కండరాల బలం తగ్గుతుంది. 

దగ్గు ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నిజానికి దగ్గు ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే బాడీ నీరసంగా మారుతుంది. 

విరేచనాలు, వాంతులు, వికారం వంటి సమస్యలన్నీ ఉన్నప్పుడు వ్యాయామాలు చేయడం సరికాదు. 

అనారోగ్యంగా ఉన్నప్పుడు జిమ్ చేయడం వలన మీ బాడీపై ఒత్తిడి పెరుగుతుంది.

ముఖ్యంగా జ్వరంగా ఉన్నప్పుడు వ్యాయామం చేస్తే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది.

అనంతరం రక్తప్రవాహం దీనివల్ల మీ గుండెపై చెడు ప్రభావం పడుతుంది.