ప్రస్తుత కాలంలో జుట్టు రాలడం సర్వసాధారణ సమస్యగా మారిపోయింది.

జుట్టు రాలడం చాలా మంది ఆందోళనకు గురవుతుంటారు.

జుట్టు రాలడం ఆగిపోవాలని అనేక రకాల షాపులు మందులు వాడుతుంటారు.

నిజానికి మీరు షాంపును, నూనెను మార్చినంత మాత్రాన జుట్టు రాలడం ఆగిపోదు.

ఎందుకంటే జుట్టుకు కావాల్సింది లోపలి నుంచి పోషణ అవసరం. 

ఇంతకు హెయిర్ ఫాల్ ను ఎలా ఆపాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆహారంల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలను చేర్చుకోవాలి. 

గుడ్లు, చేపలు, పప్పు ధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, పాలల్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతున్న వాళ్లు విటమిన్ 'ఇ' ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. 

కాల్షియం ఎముకలను బలంగా ఉంచడమే కాదు.. జుట్టును బలోపేతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. 

పాలు, పెరుగు, జున్ను వంటి వాటిల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల జుట్టు ఊడిపోవడం ఆగిపోతుంది. 

ఆహారంతో పాటుగా..ఆరోగ్యవంతమైన జుట్టుకోసం జుట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. 

జుట్టు ఊడిపోకుండా ఉండాలంటే రోజూ కాసేపు నెత్తిని మసాజ్ చేయాలి.

మసాజ్ చేయడం ద్వారా నెత్తికి రక్తప్రసరణ మెరుగ్గా జరిగి కుదుళ్లు బలపడతాయి. 

రోజుల తరబడి జుట్టును శుభ్రం చేయకపోతే జుట్టుపై మురికి పేరుకుపోతుంది. జుట్టును ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. 

కెమికల్స్ ఎక్కువగా ఉండే షాంపూలను కూడా వాడకూదు. ఇవి కూడా జుట్టు రాలిపోవడానికి కారణమవుతాయి.