ప్రతి ఒక్కరూ వయసు రాగానే పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. పెళ్లికి వయసు మాత్రమే అర్హత కాదు ఇంకా చాలా ఉండాలి.

వచ్చే వాళ్లకు పలానా క్వాలిటీస్ ఉండాలనుకుంటారు కానీ అవే క్వాలిటీస్ మనకు ఉన్నాయా లేదా అని చూసుకోరు.

తమ జీవిత భాగస్వామికి రోజూ ఆందోళన కలిగేలా చేస్తున్నారా అయితే మీరు పెళ్లికి ఇంకా సెట్ కాలేదని అర్ధం.

పార్ట్ నర్ తో ఉన్నప్పుడు ఆనందంగా ఉండాలి కానీ టెన్షన్ ఉండకూడదు. ప్రతిసారి నమ్మమని మీరు చెప్పాల్సి వస్తుందంటే.. మీ లైఫ్ అంత కరెక్ట్ గా లేదని అర్థం.

ఆ వ్యక్తి అలాంటివాడు అని పెళ్లికి ముందే అర్థమైతే వారిని చేసుకోకపోవడమే మంచిది. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు పెళ్లికి సెట్ కారు!

అతిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేవారు కూడా పెళ్లికి సెట్ కారు. 

అన్ని విషయాలకు త్వరగా కమిట్ అయ్యేవారిని ఎంచుకోవడం కూడా తెలివైన ఎంపిక కాదు.

ఎదుటి వ్యక్తి ఎలా చచ్చినా సరే తమ గురించి మాత్రమే కొందరు ఆలోచిస్తుంటారు. అలాంటి స్వార్థపరులు పెళ్లి తర్వాత కూడా మారకపోవచ్చు.

కాబట్టి అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు కూడా తొందరగా పెళ్లికి సెట్ అవ్వరు. స్వార్థపరులతో జీవితాంతం సంతోషంగా ఉండలేరు.

నిరంతం విమర్శిస్తూ, ఎగతాళి చేసేవారిని కూడా పెళ్లికి సెట్ అవ్వరు! వీరు మీ ఆత్మగౌరవాన్ని తగ్గిస్తూ ఉంటారు.

కాబట్టి ఇలాంటి వారిని చేసుకునే ముందు ఓసారి ఆలోచించండి.

ఎప్పుడూ నీతులు చెప్పేవారు పెద్దగా తప్పులు చేయరు. అలాంటి వారితో జీవించడం చాలా కష్టం. వీళ్లు చేయరు కానీ ఎదుటివారిలో తప్పులు వెతుకుతుంటారు.

ప్రతిదానికి అవసరం కంటే ఎక్కువగా రెస్పాండ్ అయ్యేవారు కూడా కచ్చితంగా పెళ్లికి సెట్ అవ్వరు!

చిన్న విషయం గురించి ఎక్కువగా వాదిస్తున్నా సరే అలాంటి వాళ్ల గురించి ఓసారి ఆలోచించండి. ఎందుకంటే వాళ్లు.. మీ మాటలు వింటారనే గ్యారంటీ లేదు.

నోట్: పైన చెప్పినవన్నీ కూడా సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల్లో ఉన్న అంశాల ఆధారంగా రాశాం. గమనించగలరు