అందం, డబ్బు, హోదాలతో సంబంధం లేకుండా గులిమి అనేది అందరి చెవుల్లో ఉండనే ఉంటుంది.

కొంతమంది ప్రతీ రోజు గులిమి తీసుకుంటూ ఉంటారు. 

మరికొంత మంది చెవిలో ఇ‍బ్బందిగా అనిపించినపుడు అలా చేస్తుంటారు.

వేటిని పడితే వాటిని చెవిలోకి జొప్పించి గెలుకుతూ ఉంటారు.

అయితే, చెవిలో గులిమి తీయటానికి ఎవైనా వస్తువులు చెవిలో పెట్టడం అత్యంత ప్రమాదం అని మీకు తెలుసా?

ఇలా చేయటం వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉందట.

మ‌నం చెవిలో ఉండే గులిమి తీయ‌డం కోసం చెవిలో ఇయ‌ర్ బ‌డ్స్ లేదా వేటిని పడితే వాటిని లోప‌లి వ‌ర‌కు పోనిచ్చి గెలుకుతూ ఉంటాం.

ఇలా చేయ‌డం వ‌ల్ల హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

ఎలా అంటే.. చెవిలో ఏవైనా వస్తువులు పెట్టి తిప్పిన‌ప్పుడు అందులో ఉండే ఓ ప్ర‌త్యేకమైన నాడి వ‌ల్ల వాగ‌ల్‌ స్టిమ్యూలేషన్‌ జరుగుతుందట.

అలా అక్క‌డి నుంచి ఎల‌క్ట్రిక్ షాక్ గుండెకు చేరుతుంద‌ట‌.

దీంతో హార్ట్ ఫెయిల్యూర్‌, హార్ట్ ఎటాక్‌లు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

మరి, మీరు చెవిలో గులిమి తీయటానికి వేటిని పడితే వాటిని చెవిలో పెడుతుంటే జాగ్రత్త మరి.