చలి కాలం వేళ చాలా మంది వండిన ఆహారం కంటే బయటవండిన ఆహారాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.
ఈ చలి కాలంలో మంచి మాస్ మసాల ఫుడ్, ఫ్రైడ్ రైస్ లు, బజ్జీలు వంటివి తినేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు.
పైగా చలి, కాస్త నోట్లోకి వేడి వేడి పాస్ట్ ఫుడ్ తింటే ఆ మజానే వేరంటూ చాలా మంది ఇలాంటి ఫుడ్ ను తీనేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే ఇలాంటి ఆహారం తినడం వల్ల లేని పోని ఆనారోగ్య సమస్యలు రావడంతో పాటు గుండె పోటు వచ్చే ప్రమాదం కూడా లేకపోలేదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చలికాలం వేళ ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి? ఎలాంటివి తినకూడదు? అసలు నిపుణులు ఏం సూచిస్తున్నారనే పూర్తి వివరాలు మీ కోసం.
చలికాలంలో వేయించిన ఆహార పదార్థాలు అసలు తీసుకోకూడదట. తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.
దీంతో పాటు ఫ్రైడ్ రైస్ ను తినడం అసలే మంచిది కాదట. ఇది తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ పెరుగుతుందట.
చలి కాలంలో స్వీట్స్ తినడం కూడా అంత మంచిది కాదని, ఇలాంటివి తినడం ద్వారా గుండె సంబంధమైన వ్యాధులు వస్తాయని చెబుతున్నారు.
చలికాలంలో మాంసం ఎక్కువగా తీసుకోకూడదు. తీసుకుంటే మాత్రం చికెన్, చేపలు తినడం మంచిది.
చలి కాలంలో జున్ను ఎక్కువగా తీసుకోకూడదట. ఇందులో అధిక కొలెస్ట్రాల్ ఉండడం ద్వారా గుండెకు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వీటితో పాటు ఈ చలికాలంలో పన్నీరు తినడం కూడా అంత మంచిది కాదట.
పైన తెలిపిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక: ఇది అంతర్జాలంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. అవగాహన కోసం నిపుణులను, వైద్యులను సంప్రదించవలసినదిగా మనవి.