బీపీ భయంతో ఉప్పులేని వంటలు తింటున్నారా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!
మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మరిన్ని అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
హైబీపీ సమస్య బారిన పడకుండా ముందు జాగ్రత్తతో ఉప్పు లేని వంటలు తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
బీపీ భయంతో ఉప్పులేని వంటలు తినడం ద్వారా మీరు మరింత ప్రమాదంలో పడినట్టేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఉప్పు ఎంత తీసుకోవాలి అనే విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉప్పు అనేది మన శరీరానికి చాలా అవసరం. ఉప్పు తీసుకోవడం ద్వారా శరీరంలో ఉన్న నీటి పరిమాణాన్ని సోడియం ద్వారా తగ్గించేందుకు సహాయపడుతుంది.
అలాగని ఉప్పును అధికంగా తీసుకోవడం ద్వారా చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉప్పును అధికంగా తీసుకోవడం ద్వారా ఉబయ కాయం, ఎముకలు సన్నబడడం, పక్షవాతం, పెద్ద ప్రేగు క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయట.
ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు చాలా మంది ఉప్పులేని వంటలు తింటుంటారు.
అలా హైబీపీ భయంతో ఉప్పులు లేని వంటకాలు తీసుకోవడం అనేది మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని కూడా వైద్యులు చెబుతున్నారు.
ఉప్పులు లేని వంటకాలు తీసుకోవడం ద్వారా లోపీబీ, డీహైడ్రేషన్, కండరాల బలహీన పడడం వంటి రోగాలు దగ్గరవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోవాలట.
Note : ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.