రోజుకొక యాపిల్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

దీంతో చాలా మంది రోజుకొక యాపిల్ పండును తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అయితే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే? యాపిల్ తో పాటు అందులో ఉండే గింజలను కూడా తింటుంటారు.

 అలా యాపిల్ గింజలను తినడం చాలా డేంజర్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

యాపిల్ గింజలను తినడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అసలు వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

యాపిల్ గింజలను తినడం ద్వారా ఆరోగ్యానికి హానిని కలగజేస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

యాపిల్ లో గింజల్లో అమిగ్జాలిన్ ఉంటుంది. ఇది శరీరంలోకి చేరి జీర్ణ ఎంజైమ్ లతో ప్రతి చర్య జరిపి సైనైడ్ ను విడుదల చేస్తాయని చెబుతున్నారు.

యాపిల్ గింజలను తినడం వల్ల కడుపు నొప్పి, తల నొప్పి, వికారం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయట.

ఇంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే ఆస్కారం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.

మరీ ముఖ్యంగా ఈ యాపిల్ గింజలను చిన్న పిల్లలు అస్సలే తినకూడదని చెబుతున్నారు.

యాపిల్ గింజలు తినడం వల్ల కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా లేకపోలేదని నిపుణులు  హెచ్చరిస్తున్నారు.

ఇక నుంచైనా యాపిల్ తినేటప్పుడు అందులో ఉండే గింజలను వేరు చేసిన తర్వాతే తినాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.