పాల నుంచి తయారయ్యే పదార్థాల్లో పెరుగు ఒకటి. దీన్ని మనం ఆహారంగా తీసుకుంటాం.

పెరుగులో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పాలు అంటే ఇష్టం లేని వాళ్లుకూడా పెరుగు తీసుకోవచ్చు.

ఎందుకంటే పెరుగులో శరీరానికి మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.

ప్రస్తుతమున్న ఆహార అలవాట్ల కారణంగా ఈ బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. ఇది లభించే పెరుతు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి.

కాబట్ట రోజువారీ ఆహారంలో పెరుగు తప్పకుండా తీసుకోవాలి. కొందరు రాత్రిపూట పెరుగు తినకూడదని అంటుంటారు.

కానీ పగలు- రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడైనా సరే పెరుగు తినొచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.

జలుబు, దగ్గు, అలర్జీలతో బాధపడే వారు మాత్రం రాత్రిపూట పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.

పెరుగు కఫానికి కారణమవుతుందని.. జలుబు, దగ్గుతో బాధపడేవారు దీన్ని తీసుకోవద్దని ఆయుర్వేదం చెబుతోంది.

ఒకవేళ పెరుగు తీసుకోకుండా ఉండలేని టైంలో పలుచటి మజ్జిగ తీసుకోవచ్చు.

ఇందులో చిటికెడు ఉప్పు, జీలకర్ర, పొడి కలిపి తాగితే మరింత మేలు కలుగుతుంది.

ఉదయం పూట పెరుగు తినే వారు దానిలో పంచదార కలుపుకోకుండా తినాలి.

రాత్రి తినేవారు మాత్రం పంచరార, మిరియాల పొడి కలుపుకొని తింటే పొట్టకు హాయిగా ఉంటుంది.

వేసవి కాలంలో పెరుగన్నం అలవాటు చేసుకోవాలి. పొరపాటున కూడా పెరుగు వేడి చేసి తినకూడదు.

పెరుగులో పంచదార వేసి లస్సీలాగా చేసుకుని కూడా తినొచ్చు.

పెరుగులో టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి పెరుగు చట్నీ చేసుకుని తినొచ్చు.

మజ్జిగ చారు చేసుకుని ఎండకాలం తినడం శ్రేయస్కరం. ఇక ఇదే కాలంలో పెరుగున్నం తింటే వచ్చే చల్లదనమే వేరు.

అలానే గట్టి పెరుగు అస్సలు తీసుకోకూడదు. పెరుగులో నీళ్లు కలిపిన తర్వాతే ఆహారంగా తీసుకోవాలి.