డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఆరోగ్య నిపుణులు చెప్పడంతో చాలా మంది వీటిని రోజూ తీసుకుంటుంటారు.
రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం పూట పరిగడుపునా తీసుకుంటూ ఉంటారు.
కొందరు బాదం పప్పు, జీడి పప్పులను నూనేలో వేయించుకుకోని తింటుంటారు.
ఇలా తినడం ఎంత వరకు మంచిది? అసలు బాదం పప్పు, జీడి పప్పును రోజూ తీసుకోవడం ద్వారా ఏమైన అనారోగ్య సమస్యలు వస్తాయా?
నిపుణులు ఏం చెబుతున్నారనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పప్పు, జీడి పప్పును రోజూ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ డ్రై ఫ్రూట్స్ ని ఏడాదిన్నర వయసు గల పిల్లల నుంచి ముసలివాళ్ల వరకు అందరూ తీసుకొవచ్చని సూచిస్తున్నారు.
చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని నాన బెట్టకుండా అలాగే తింటూ ఉంటారు.
నాన బెట్టకుండా బాదం, జీడిపప్పులను తీసుకోవడం వల్ల 70 శాతం మాత్రమే మన పేగుల్లోకి వెళ్తాయని
మిగిలిన 30 శాతం పోషకాలు వ్యర్ధాల నుంచి బయటకు పోతాయట.
ఖచ్చితంగ డ్రై ఫ్రూట్స్ ఏవైనా సరే నాన బెట్టి తీసుకోవడమే చాలా మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.
నాన బెట్టిన బాదం పప్పు, జీడి పప్పును తీసుకోవడం ద్వారా తొందరగా జీర్ణమవ్వడంతో పాటు అధిక శాతం పోషకాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం అంతర్జాలంలో సేకరించింది మాత్రమే. అవగాహన కోసం నిపుణులను సంప్రదించవలసిందిగా మనవి.