మారిన కాలానికి అనుగుణంగా నేటి కాలం యువత ఎక్కువగా మద్యానికి అలవాటు పడుతున్నారు.
అంతేకాకుండా మద్యం తాగడం అనేది ఫ్యాషన్ అంటూ గ్లాసులు గ్లాసులు ఎత్తేస్తున్నారు. దీంతో పాటు ఎనర్జీ డ్రింక్స్ కూడా తాగుతున్నారు.
అసలు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి?
నిపుణులు ఏం చెబుతున్నారనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
నేటి కాలం యువత కుల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగుతున్నారు.
ఇవి తాగడం వల్ల భయంకరమైన రోగాలను తెచ్చిపెడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరీ ముఖ్యంగా ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంపై రోగ నిదరోధక శక్తిని తగ్గించేందుకు సహయపడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైందని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇది క్యాన్సర్ కు కూడా దారి తీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ కలిగి ఉండి, వ్యాధులను ఎదుర్కోవాలంటే ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ తాగకపోవడం ఉత్తమం అంటూ నిపుణులు సూచిస్తున్నారు.
ఇక నుంచైనా ఎనర్జీ డ్రింక్స్ తాగడం మానేసి ఆరోగ్యంగా ఉండాలంటూ నిపుణులు తెలియజేస్తున్నారు.