డాక్టర్లు పలానా పండ్లు తింటే ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు. కానీ కొందరు వాటిని అతిగా తిని అనారోగ్యం పాలవుతారు.
చాలా మంది డాక్టర్లు రోజూ ఓ గ్లాస్ నిమ్మరసం తాగితే మంచిదని చెబుతారు.
దాని వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది కదా అని ఎక్కువ మోతాదులో నిమ్మరసం తాగితే దుష్ఫరినామాలు తప్పవు అంటున్నారు వైద్య నిపుణులు.
కానీ అంతకు మించితే ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
లెమెన్ జ్యూస్ ను ఎక్కువగా తీసుకుంటే కడుపులో యాసిడ్ ల శాతం పెరుగుతుంది
దాంతో గ్యాస్, అసిడిటీ, కడుపులో నొప్పి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇక నిమ్మరసం ఎక్కువగా తాగితే.. అందులో ఉండే విటమిన్ సి వల్ల వాంతులు, డయేరియా, వికారం వంటివాటికి దారితీస్తుంది.
లెమెన్ జ్యూస్ అతిగా తీసుకుంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి.. మూత్ర సంబంధ వ్యాధులు వచ్చే ఆస్కారం ఉందంటున్నారు వైద్య నిపుణులు.
ఈ రసం తాగటం మూలంగా దంతాలు క్షయం అవుతాయి. పళ్ళపై ఉండే ఎనామిల్ పోయి, త్వరగా పుచ్చిపోతాయి.
అతిగా నిమ్మరసం తీసుకుంటే.. నోట్లో యాసిడ్ ప్రభావం ఎక్కువై నాలుక పగులుతుంది. దాంతో రుచి గ్రహించే శక్తి కోల్పోతుంది.
అదీకాక పేగులు, జీర్ణాశయంలో యాసిడ్ ల ప్రభావం వల్ల ప్రేగుల్లో పుండ్లు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.