బయట షాపుల్లో కంటే ఆన్ లైన్ లో ఎక్కువ ఆఫర్స్ ఉంటాయని వాటిలో షూస్ కొంటుంటారు.

ఇలా కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు వచ్చిపడతాయి.

ఆన్ లైన్ లో షూస్ కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశీలించాల్సిన అంశాలు పరిశీలిద్దాం.

చాలాసార్లు ఆన్ లైన్ లో కనిపించే ఫొటోల్లో షూస్ అందంగా ఉంటాయి. డెలివరీ అయినవి అలా ఉండవు.

అందువల్ల ఆల్రెడీ కొనుకున్న వారు ఇచ్చిన రేటింగ్స్... రాసిన రివ్యూలు, పెట్టిన ఫొటోలు గమనించండి.

అవి మీరు కరెక్ట్ గా పరిశీలిస్తే అసలు స్వరూపం బయటపడుతుంది.

ఆన్ లైన్ చాలా మోసాలు జరుగుతుంటాయి. అందుకే షూస్ కొనేటప్పుడు బ్రాండెడ్ కంపెనీవి మాత్రమే కొనండి.

అప్పుడే ఏవి ఆర్డర్ చేస్తారో అవే వస్తాయి. బ్రాండ్ కి తగ్గట్లు ఎక్కువ కాలం మన్నుతాయి.

ఆన్ లైన్ లో కొన్ని షూస్ ని రిటర్న్ పంపే వీలుండదు. అందువల్ల రిటర్న్ పాలసీ చూసి కొనండి.

మీకు నడిచే, రన్నింగ్ చేసుకునే అవసరం ఎక్కువగా ఉంటే.. లైట్ వెయిట్ షూస్ కొనుక్కోవడం మేలు.

స్పోర్ట్స్ షూస్ లో తేలికైనవి చాలా రకాలున్నాయి. కాబట్టి వాటి వివరాలు పూర్తిగా తెలుసుకుని కొనడం మేలు.

మీ షూస్ సైజ్ మీకు తెలుసు. ఆన్ లైన్ లో బుక్ చేసినప్పుడు కొన్నిసార్లు సైజు తేడా కొట్టేస్తుంది.

అందువల్ల మీ షూస్ నంబరు 7 అయితే 8 ఆర్డర్ చేసుకోవడం ఉత్తమం.

ఆన్ లైన్ షూస్ అనే కాదు ఏది కొన్నాసరే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవడం మేలు.

దీంతో హ్యాకర్ల బెడద నుంచి తప్పించుకోవచ్చు. ప్రొడక్ట్ అనుకున్న విధంగా లేకపోతే.. డబ్బులు ఇవ్వకముందే రిటర్న్ చేయొచ్చు.

కొన్నిరకాల షూస్ పాదాల్ని కొరికేస్తాయి. అందువల్ల షూ కొన్న తర్వాత రెండు రోజులు ఇంట్లో వాడి చూడండి.

మీరు అనుకున్నట్లు లేకపోతే రిటర్న్ ఇచ్చేయండి. ఇంట్లో వాడతారు కాబట్టి మట్టి అంటుకోదు. రిటర్న్ ఇచ్చేయొచ్చు.