చాలా మంది చీటికి మాటికి గోర్లను కొరుకుతూ ఉంటారు. నడుస్తూ ఉన్నప్పుడు, సరదాగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పడు, బస్సుల్లో ప్రయాణిస్తున్నప్పుడు గోర్లను కొరుకుతూ ఉంటారు.

 అలా చేయడం గోర్లను కొరకడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గోళ్లను కొరకడం వల్ల కలిగే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మాములుగా చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ల వరకూ చాలా మంది అప్పుడప్పుడు గోర్లను కొరుకుతుంటారు.

అలా గోర్లను కొరకడం చాలా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. గోర్లను నమలడం, కొరకడం వలన అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందట.

అలా గోర్లను కొరకడం చాలా ప్రమాదమే అంటున్నారు నిపుణులు. గోర్లను నమలడం, కొరకడం వలన అనేక ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం ఉందట.

 గోర్ల చుట్టు ఉండే బాక్టీరియా కడుపులోకి వెళ్లి పరాన్న జీవులకు చేరే ప్రమాదం పొంచి ఉంటుంది.

తద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపునొప్పి సమస్య కూడా రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అంతేకాకుండా ఫంగక్ దాడి చేయడంతో పాటు చిగుళ్ల సమస్యలు కూడా వస్తాయట.

సామాజికంగా బలహీనతలకు లోనయ్యే వాళ్లు ఇలా చీటికి మాటికి గోర్లను కొరుకుతారని, అలా చేయడం మానుకోవాలంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మీకు కూడా ఇలా గోర్లు కొరికే అలవాటు ఉందా? అయితే వెంటనే మానుకోవడం చాలా బెటర్.