వేసవి కాలంలో ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
ఇక దంచికొట్టే ఎండలతో చాలా మంది అడుగు బయట పెట్టాలంటేనే భయపడిపోతుంటారు.
ఇదిలా ఉంటే.. వేసవి కాలంలో చాలా రకాల చర్మ సమస్యలు అందరినీ వేధిస్తుంటాయి.
మరీ ముఖ్యంగా చాలా మందిని చెమట కాయలు, స్కిన్ ఎలర్జీ వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి.
చెమటకు చర్మం ఎర్రగా మారి పొక్కులు పొక్కులుగా మారుడంతో ఇబ్బందిపడుతూ ఉంటారు.
వాటి నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే అనేక రకాల పౌడర్స్ లేదా క్రీములు వాడుతుంటారు. వాటి వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.
ఇవన్నీ కాకుండా ఈ సింపుల్ చిట్కాతో చెమట కాయల నుంచి బయటపడండి అంటున్నారు నిపుణులు.
వేసవిలో చెమట కారణంగా ఏర్పడే చెమట కాయల మీద తడిపిన గుడ్డతో తుడవాలి.
అంతేకాకుండా ప్రతీ రోజు చన్నీళ్లతో మాత్రమే స్నానం చేయాలి.
ఇలాంటి చెమటకాయ సమస్య ఉన్నవారు కాటన్ దుస్తువులు ధరించడం ఉత్తమం.
దీంతో పాటు ఎప్పుడూ చల్లటి వాతావరణంలో ఉండేలా చూసుకోవాలి.
చెమట కాయలతో బాధపడే వారు ఇలా చేస్తే వాటి నుంచి పూర్తిగా బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.