ఆప్రికాట్ పేరు చెప్పగానే ఇది ఏంటో మాకు తెలియదే అని బ్లాంక్ ఫేస్ పెడతారు.

దీన్ని సీమ బాదం, ఖుర్బానీ పండు అని వాడుక భాషలో పిలుస్తారు. ఇది తీపి, వగరు రుచులతో డిఫరెంట్ గా ఉంటుంది.

ఆప్రికాట్ తో చాలానే ఆరోగ్య ప్రయోజనాలు. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, సీ, ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి.

శరీరంలో మనల్ని ఇబ్బంది పెట్టే కొవ్వుని కరిగించడంలోనూ ఆప్రికాట్ చాలా బాగా పనిచేస్తుంది.

దీనిలోని ఫైబర్ తోపాటు లాక్సేటివ్ గుణాలు.. మలబద్ధకం సమస్యలని దూరం చేస్తాయి.

ఆప్రికాట్ లోని విటమిన్ ఏ.. కంటి సమస్యలు రాకుండా చూస్తుంది.

దీనిలోని ఇనుము సమృద్ధిగా ఉంటుంది కాబట్టి.. మనకు ఎనీమియా వచ్చే ఛాన్సులు తగ్గుతాయి.

దీన్ని తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

ఎముకుల ఆరోగ్యానికి కావాల్సిన ఖనిజాలు.. వీటిలో మెండుగా ఉంటాయి.

ఆప్రికాట్ లోని విటమిన్ ఏ, సీతో పాటు ఫైటో న్యూట్రియంట్స్ చర్మాన్ని ఆరోగ్యంగా మృదువుగా ఉంచుతాయి.

ఆప్రికాట్ తినడం వల్ల కండరాలకు శక్తి పెరుగుతుంది.

దీనిలో క్యాన్సర్ ని నివారించే కెరోటినాయిడ్స్ ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

దీనిలోని అధికంగా ఉండే పీచు.. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బరువు పెరగకుండా చేస్తుంది.

కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ వ్యాధి రాకుండా ఇది కాపాడుతుంది.

ఉబ్బసం, జలుబు, ఫ్లూ లక్షణాలు ఉన్నవారు.. ఇది తింటే ఉపశమనం కలుగుతుంది.