డిగ్రీ, డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 150 ఖాళీల కోసం జాబ్ మేళా నిర్వహిస్తోంది.
ఏపీఎస్ఎస్డీసీతిరుపతి జిల్లా శ్రీ సిటీలో ఈ నెల 24న జాబ్ మేళా నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 150, పోస్ట్: ట్రైనీ, జీతం: 13,200/- + షిఫ్ట్ అలవెన్సు
అర్హతలు: ఈఈఈ, ఈసీఈ, మెకానికల్, కంప్యూటర్స్ లో డిప్లొమా చేసి ఉండాలి. మ్యాథ్స్, ఫిజిక్స్ & కెమిస్ట్రీలో బీఎస్సీ చేసి ఉండాలి.
డిప్లొమా, డిగ్రీలో బ్యాక్ లాగ్ సబ్జెక్టులు ఉండకూడదు.
2020, 2021, 2022 సంవత్సరాల్లో డిగ్రీ లేదు డిప్లొమా ఉత్తీర్ణులైన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లో చేర్చుకోనున్నారు. ట్రైనింగ్ 5 రోజులు ఉంటుంది.
వయసు పరిమితి: 25 ఏళ్లకి మించి ఉండకూడదు. ఆడవారికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది.
ఎంపిక: హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేస్తారు.
జాబ్ లొకేషన్: ఎంపికైన అభ్యర్థులు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ, తడ గ్రామంలో ఫ్యాక్టరీలో జాబ్ చేయాల్సి ఉంటుంది.
ప్రయోజనాలు: ట్రైనింగ్ లో జీతంతో పాటు హాస్టల్ వసతి, భోజన సదుపాయం ఉంటాయి.
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 24/10/2022