2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల అంచనాలతో బుగ్గన శాసనసభలో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు.
మొత్తం బడ్జెట్ - రూ. 2,79,279 కోట్లు రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు మూలధన వ్యయం రూ.31,061 కోట్లు రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం - రూ.38,605 కోట్లు
పేదలందరికీ ఇళ్లు - రూ.5,600 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి (ఇరిగేషన్) - రూ.11,908 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖకు - రూ.3,858 కోట్లు