ప్రస్తుత కాలంలో చాలామంది తమ జీవితాన్ని బిజీబిజీగా గడుపుతున్నారు.

గజిబిజిగా ఉండే  ఈ లైఫ్ స్టైల్  కారణంగా చాలామందికి కోపం, చిరాకు వస్తుంటాయి.

ఈ కోపం వలన మనిషిలో ఒత్తిడి పెరిగి రోజంతా నిరాశగా, అసహనంగా ఉంటారు

మహిళలు కూడా ఇంటిపనులు, ఆఫీసు పనులతో అప్పుడప్పుడు చిరాకుకి గురవుతుంటారు

అయితే ఎవరికైన ప్రతి చిన్న విషయానికి చిరాకు,కోపం వస్తుంటే చెక్ పెట్టేందుకు కొన్ని మార్గాలున్నాయి.

సాధారణంగా అనుకున్న పని జరగనప్పుడు కోపం రావడం సహజం.

జీవితంలో ఉన్నదున్నట్లుగా స్వీకరించడం ద్వారా  కూల్ గా ఉండొచ్చు.

కోపం ఎక్కువ వచ్చే వాళ్లు ఒంటరిగా కంటే నలుగురితో కలివిడిగా ఉంటే మంచింది.

అలా చేయడం వలన పని ఒత్తిడి నుంచి విశ్రాంతి లభిస్తుంది.

అప్పుడప్పుడు కుటుంబంతో కలిసి బయటకు వెళ్లడంతో మానసిక ప్రశాంత లభిస్తుంది.

అలానే ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి గేమ్స్ ఆడటం ద్వారా ఒత్తిడి  తగ్గుతుంది.

స్వీట్లు, జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా కోపం పెరుగుతుంది. 

కాబట్టి వాటిని తిన్నడం తగ్గించి..తాజా కూరగాయాలను, పండ్లను తీసుకోవాలి.

ఫోన్లు అతిగా చూడటం వలన కూడా చిరాకు, కోపం వంటి వస్తుంటాయి.

మనస్సు ప్రశాంతంగా ఉండేందు వీలైనంత వరకు ఫోన్ ను దూరంగా పెట్టడం మంచింది.

ప్రతి రోజూ యోగా, వాకింగ్ చేయడం ద్వార మనస్సు ప్రశాంతగా ఉంటుంది.

సంతోషంగా ఉంటాను అని మన మనస్సుకు బలంగా చెప్పుకోవాలి.