డ్రగ్స్-సినిమా ఇండస్ట్రీ.. ఎప్పుడు సోషల్ మీడియాలో దీని గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది.
అప్పట్లో టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
స్టార్ పూరీజగన్నాథ్ తోపాటు హీరో రవితేజ, నటుడు సుబ్బరాజు లాంటి వాళ్లని అధికారులు అప్పట్లో విచారించారు.
మరి ఆ కేసు ఏమైందో ఏమో తెలియదు గానీ అది అలా పూర్తిగా మరుగున పడిపోయింది. దాని గురించి అందరూ మర్చిపోయారు.
ఇలా అంతా ప్రశాంతంగానే ఉండగా.. తాజాగా ఓ నటిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
ఇంతకీ ఆ నటి ఎవరు? డ్రగ్స్ కేసులో ఎందుకు అరెస్ట్ అయిందా? అని నెటిజన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు.
కేరళ ఇండస్ట్రీకి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ కమ్ నటి అంజుకృష్ణ.. గత కొన్నాళ్ల నుంచి ఉనిచ్చిర ఊరిలో అద్దెకు ఉంటోంది.
తనకు మూడేళ్ల క్రితం పరిచయమైన షామీర్ తో పాటు కలిసి ఉంటుంది. ఇద్దరం భార్యభర్తలు అని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకున్నారు.
కొన్నేళ్ల నుంచి సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ వచ్చిన అంజుకృష్ణ.. చాలాసార్లు మొండిచేయి ఎదురైంది.
దీంతో ఛాన్సులు రావడం లేదని, డబ్బు కోసం అడ్డదారి తొక్కింది. అక్రమంగా డ్రగ్స్ అమ్మడం మొదలుపెట్టింది.
బెంగళూరు నుంచి సరుకు తెప్పించి, ఉనిచ్చిరలో తను అద్దెకు ఉంటున్న ఇంట్లో డ్రగ్స్ ని నిల్వ చేయడం స్టార్ట్ చేసింది.
ఎక్కువగా డబ్బులు వస్తుండేసరికి యథేచ్ఛగా డ్రగ్స్ విక్రయిస్తూ వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందింది.
తాజాగా అంజుకృష్ణ ఉంటున్న ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆమెని అరెస్ట్ చేసి, 56 గ్రాముల సింథటిక్ MDMAని స్వాధీనం చేసుకున్నారు.
అయితే పోలీసులు సోదాలకు రావడం చూసిన అంజుకృష్ణ ఫ్రెండ్ షామీర్.. అక్కడి నుంచి పారిపోయాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
మరి డ్రగ్స్ కేసులో యువనటి అరెస్ట్ కావడంపై మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.