వైవిధ్యమైన పాత్రలతో తెలుగు నాట తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజీవ్ కనకాల.

విలన్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ అయినా, సీరియస్ రోల్స్ అయినా.. 

ఎలాంటి పాత్ర అయినా సరే గొప్పగా నటించి మెప్పించగల సమర్ధుడు రాజీవ్ కనకాల.

ఇక సుమ తన మాటలతో, పంచులతో కావల్సినంత కామెడీని అందిస్తారు. 

తనదైన చమత్కారంతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తారు. 

కెరీర్ పరంగా ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబం విషయంలో మాత్రం బ్యాలన్స్ ని మెయింటెయిన్ చేస్తారు. 

కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్యాకప్ చెప్పేసాక ఇంట్లో మీటప్ అయిపోతారు.

పండగలొచ్చినా, ఇంకేదైనా అకేషన్ వచ్చినా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటారు. 

సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు, ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. 

తాజాగా రాజీవ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన వీడియో ఒకటి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సుమ.

నవంబర్ 13న రాజీవ్ కనకాల పుట్టినరోజు సందర్భంగా సుమ.. ఇంట్లో కేక్ కట్ చేయించారు. 

అనంతరం ఈ జంట అలా బయటకు వెళ్లారు. బోట్ షికారు చేస్తూ.. ప్రకృతి అందాలను ఆస్వాదించారు.

టైటానిక్ సినిమాలో హీరో, హీరోయిన్ లా ఇద్దరూ పడవ అంచున నిలబడి ఫోజులిచ్చారు.

ఆ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.