ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ పెళ్లిపీటలెక్కనున్నారని తెలిస్తే.. తమ అభిమాన హీరో, హీరోయిన్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంటుంది.

ఎందుకంటే.. హీరోల గురించి చెబితే పెద్దగా రియాక్ట్ అవ్వని ఫ్యాన్స్.. హీరోయిన్లకు పెళ్లి అయిపోతుందని చెబితే వెంటనే రియాక్ట్ అవుతుంటారు.

అందులోనూ హీరోయిన్ కి పెళ్లంటే.. ఆనందించే వాళ్ళకంటే బాధపడేవారే ఎక్కువ. అయితే.. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్స్ పెళ్లికి సంబంధించి పుకార్లు కూడా ట్రెండ్ సృష్టిస్తుంటాయి.

తాజాగా ఓ హీరోయిన్ విషయంలో అదే జరిగింది. ఆమె పెళ్లి గెటప్ లో ఉన్న ఫోటో తీసుకొని ఏకంగా పెళ్లి అయిపోయిందని, కానీ ఆ పెళ్లికొడుకు ఎవరు అనేది ఫోటోలలో సరిగ్గా కనిపించడం లేదని ప్రచారం చేశారు.

తీరా ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి సదరు హీరోయిన్ చెవిలో పడేసరికి.. నాకు పెళ్లి ఏంటంటూ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది హీరోయిన్.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని అనుకుంటున్నారా? యాంకర్ ప్రదీప్ కి జంటగా ’30రోజుల్లో ప్రేమించడం ఎలా’ మూవీతో తెలుగు డెబ్యూ చేసిన అమృత అయ్యర్.

ఈ బ్యూటీ తెలుగులో రెడ్, అర్జున ఫల్గుణ సినిమాలలో మెరిసింది. ఇప్పుడు హనుమాన్ అనే సినిమాలో తేజ సజ్జ సరసన నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. అమృత తన పెళ్లి వార్తలపై స్పందిస్తూ “నాకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలన్నీ రూమర్స్..

ఆ ఫోటోలు నేను గతంలో నటించిన ‘వణక్కమ్ డా మాప్పిళ్ళై’ మూవీలో స్టిల్స్. హీరో జివి ప్రకాష్ పక్కన పెళ్లికూతురు వేషంలో కనిపించేసరికి ఇలా పుకార్లు క్రియేట్ చేశారు.” అని చెప్పింది అమృత.

అయితే.. ఆ ఫోటోలలో అమృత కనిపిస్తోంది.. కానీ అతనెవరు అనేది తెలియక పెళ్లి చేసుకుందంటూ కోలీవుడ్ వర్గాలు కథనాలు రాశాయి.

మొత్తానికి అమృత పెళ్లి రూమర్స్ కి చెక్ పెట్టేసింది.