నటి కస్తూరి శంకర్ అంటే తెలియక పోవచ్చు కానీ గృహలక్ష్మిలో తులసి అంటే ఎవ్వరైనా గుర్తు పట్టేస్తారు.

తులసి పాత్రలో నటించిన తీరుకు  ఆమెకు చాలా మంది అభిమానులు అయ్యారు. 

1992లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకున్న ఆమె.. తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో నటించింది.

కమల్ హాసన్‌తో భారతీయుడుతో పాటు తెలుగులో మోహన్ బాబుతో సోగ్గాడి పెళ్లాం, నాగార్జునతో కలిసి అన్నమయ్యలో వంటి చిత్రాల్లో నటించింది. 

ప్రస్తుతం ఈ అమ్మడుకు 49 ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మరు. నేటి హీరోయిన్లకు తీసుపోని అందం తనది. 

ఎప్పుడు బోల్డ్ ఫోటోలతో యువతను కాక రేపుతుంటుంది.

సామాజిక కార్యకర్తగా కొన్ని విషయాలపై ప్రశ్నలు సంధిస్తుంటోంది.   సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. 

వేటి గురించి అయినా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతోంది. ఇవి కొన్ని సార్లు కాంట్రవర్సీలకు దారి తీస్తుంటాయి. 

అయితే ఆమె ప్రముఖ టెలివిజన్‌లో ప్రసారమౌతున్న షో సిక్త్ సెన్స్‌కు వెళ్లింది. ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. 

వస్తూ వస్తూనే .. ఇంట్రో కింద వేసిన వేరీ ఈజ్ ద పార్టీ  అంటూ వాల్తేరు వీరయ్య సినిమాలోని పాటకు స్టెప్స్ వేసింది.

ఇది చూసిన యాంకర్ ఓంకార్.. ‘కస్తూరి ఓ సారి లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి.. ఏ యాంగిల్ నుండి చూసినా  మదర్‌లా కనిపించడం లేదు.

మరదలిలా కనిపిస్తున్నారు’ అంటూ ఆమె  అందానికి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.

అలా అనడం ఆలస్యం కస్తూరి సిగ్గుల మొగ్గైంది. ఇక బ్రహ్మముడి కనకం అయితే.. ‘ఊ అంటావా? 

మావా.. ఊహూ అంటావా మామా’ అంటూ ఐటమ్ సాంగ్‌తో స్టేజీని ఊపేసింది. దీంతో ఆమెనుద్దేశించి కూడా హాట్ కామెంట్స్ చేశాడు.

‘మదర్స్‌‌‌ని పిలిస్తే.. మీరు ఇంత హాట్‌గా వచ్చారు.. మిమ్మల్ని చూసి నాకు చెమటలు పడుతున్నాయి’ అన్నారు. ఆ తర్వాత  అదే పాటకు కస్తూరి, కనకం ఇద్దరూ ఓ రేంజ్‌లో డ్యాన్స్ వేశారు. 

ఆ తర్వాత  బావవు నువ్వు భామను నేను అనే సాంగ్‌కు కస్తూరి డ్యాన్స్ చేయగా.. ఓంకార్ బిస్కెట్ లాంటి పదాన్ని వాడేసి.. ఆమెను పడేశాడు.

కస్తూరి గారూ కింద ఏదో పడిపోయింది’అనగానే ఆమె చూడగా.. ‘మీ అందం’అంటూ పురుషుల కామన్ డైలాగ్ వాడేశారు

అలాగే ఓ పెద్ద ఏనుగు ఇస్తా.. మీరు ఎక్కడ పెట్టుకుంటారనగా.. మీ పెద్ద మనస్సులో దాచేస్తా అంది కస్తూరి. 

చివరిలో కనకం చంద్రముఖిలో సాంగ్ లక లక సాంగ్ కు తనదైన రీతిలో డ్యాన్స్ చేసింది. ఈ మొత్తం ప్రోమోలో కస్తూరి హైలెట్‌గా నిలిచింది.